That Slum area boy …….

  చాన్నాళ్ళ క్రితం నాటి మాట. అంటే పూర్వ కాలం కాదు. ఈ కాలమే. నా కాలమే. ఓ రోజు నేను చూసిన ద్రుశ్యం నన్ను ఇంకా వెన్నాడుతూ ఉంది. ఆ దిశ గా తర్వాత కూడా నేనేం చెయ్యలేదు. దానికి నా అసమర్థత ను నిందించను. కానీ ఊరికే ఉండలేను. ప్రస్తుతానికి నిట్టూర్పు తో మీతో ఆ విషయం పంచుకుంటున్నాను.

మా వీథి లో నడుచుకుంటూ వెళ్తున్నాను. నున్నటి తారు రోడ్డు. కొత్తగా వేసినట్లు ఉంది. రోడ్డు పై పక్కనే ఉన్న స్లం యేరియా పిల్లాడు ఒకడు కూర్చుని ఉన్నాడు. ఏదో గీస్తున్నాడు తారు మీద. ఏం రాస్తున్నాడో నాకు అర్థం కాలేదు. దగ్గరకి వచ్చి చూసాను. వాడు అక్కడ చాక్పీసు తీసుకుని అక్షరాలు రాస్తున్నాడు !!!!!!! వాడి ఉద్ధెశ్యాలు ఏవన్నా కావొచ్చు. నున్నటి రోడ్డు ఆకర్షించి ఉండవచ్చు. చాక్పీసు అరిగించాలనిపించి ఉండొచ్చు. నోట్ పుస్తకం లేకపోయి ఉండవచ్చు. కానీ …. ఎందుకో అది నన్ను బాగా కదిలించింది. దాన్ని నేను వాడికి చదువుపట్ల ఆశ గానే అర్థం చేసుకున్నాను. అప్పట్లో అనుకున్నా …. నా చదువు అయిపోయి ఉద్యోగం చేస్తే నేను సంపాదించే డబ్బు లో కాస్తైనా  ఇలాంటి పిల్లల చదువుకు నా వంతు క్రుషి చేయాలని.

నా అభిప్రాయం దేశానికైనా మనిషి కైనా  భవిస్యత్తు బాగుండాలంటే చదువు ఓ రాచబాట వంటిది అని. ఆ చదువు కూడా అట్టడుగు లో ఉన్న వారికి కూడా అందుబాటు లో ఉండాలి అని. అప్పట్లో విపరీతమైన ఆవేశం ప్రభావం లో – “నేను పెద్దయ్యాక స్కూలు పెట్టాలి.  ఇలా అవకాశం లేని పిల్లలు అందరికీ అవకాశం ఇవ్వాలి. వారికి మంచి భవిష్యత్తు ఇవ్వాలి.” అంటూ చాలానే ఊహించుకున్నా. ఏమో ఒకానొక రోజు నేను కాకుంటే నాలా ఈ కలలు కన్న మరొకరు తమ కలను నిజం చేసుకుంటారేమో .. నేను చేయకపోయినా. నాలో ఏ కాస్తో ఓ మూల నా సమాజానికి ఏమైనా చేయాలి అని కోరిక రగిల్చిన సంఘటనల్లో ఇది ఒకటి. ఎవరన్నా అడిగితే టక్కున గుర్తు వచ్చేది.

Published in: on September 16, 2006 at 4:54 am  Comments (4)  

The URI to TrackBack this entry is: https://vbsowmya.wordpress.com/2006/09/16/that-slum-area-boy/trackback/

RSS feed for comments on this post.

4 CommentsLeave a comment

  1. అప్పుడే ఆశ వదిలెయ్యకండి. మీరు ఇరవయ్యో అరవయ్యో నాకు తెలీదు కానీ మీ కలలు తప్పకుండా నెరవేరుతాయి.

  2. బాగా రాసారు. (మీరు ఆర్టీయెస్ పద్ధతిలో రాస్తుంటే.. కృ రాయాలంటే ఇలా – kR – అని రాస్తే వస్తుంది.) తెలుగుబ్లాగు (http://groups.google.com/group/telugublog) గుంపులో చేరండి.

  3. మీలో కలిగిన నేటి ఆలొచనే రేపటి సత్కార్యానికి పునాది. బ్లాగు లోకానికి స్వాగతం.

  4. My dear blogger,Why are you not announcing your name?


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: