Sahitya Vyaasaalu

నవీన్ నవలల పర్వం ముగిశాక ఈ “సాహిత్య వ్యాసాలు” చదివాను. తన సాహితీ జీవితం మొదటి రోజుల్నుంచి మొన్న మొన్నటి దాకా నవీన్ రాసిన వ్యాసాల సమాహారం ఇది. నవీన్ షష్టిపూర్తి సందర్భంగా విడుదల చేసిన పుస్తకం . జనరల్ వ్యాసాలు మొదలుకుని , పాత్ర చిత్రణ ల పైనా , పుస్తకాల పైనా , రచయిత ల పైనా – ఇలా రకరకాల వ్యాసాలూ , కొకు, చలం, శ్రీశ్రీ గార్లతో ఇంటర్వ్యూ లూ కూడా ఉన్నాయి. విమర్శల గురించి ఇలా అనొచ్చో లేదో నాకు తెలీదు కానీ గొప్ప చదివించే గుణం ఉంది ఈ పుస్తకం లో.

ఈ వ్యాసాలు ఒక్కోటి చదువుతూ ముందుకు పోతూ ఉంటే నవలలు రాసిన నవీన్ , ఈయనా ఒక్కరేనా అనిపించింది. ఎందుకో ఆ నవలలు రాసిన శైలీ , ఇదీ చాలా వేరు గా అనిపించాయి. అంటే ఇది నవల కాదు కాబట్టి శైలి అలా ఉండదు అనుకోండి. కానీ నాకు మాత్రం ఇద్దరూ వేర్వేరు వ్యక్తుల్లా తోస్తున్నారు. నవలల్లో ఎక్కడో ఒకటి రెండు చోట్ల తప్ప కనబడని చమత్కారం , వ్యంగ్యం వ్యాసాల్లో చాలానే ఉన్నాయి. నవీన్ రచనల్లో ఈ అంశం నాకు నవలల్లో కనబడలేదు. ఆ “నవలా పఠనం” రోజుల్లో అనుకున్నా కూడా .. రోజూ వారి జీవితం లో హాస్యాన్నైనా చూపడే ఈయన ! అని. 🙂

ఈ వ్యాసాలు కొత్త వారికి మంచి Insight ఇస్తాయి. “పోస్ట్ మాడర్నిజం” మీది వ్యాసం చాలా బాగుంది. చక్కని విశ్లేషణ. పుస్తకాల గురించి రాసిన విశ్లేషణ లు నాబోటి వారికి పాఠ్యపుస్తకాల లాంటివే. కొందరు రచయిత ల రచనా పద్ధతి ని గూర్చి చేసిన విశ్లేషణ లు కూడా చాలా బాగున్నాయి. ఈ వ్యాసాల ద్వారా కొందరు గొప్ప సాహితీ వేత్తల గురించీ , విమర్శకులను గురించీ తెలుసుకునే అవకాశం కలిగింది. సమీఖ్ష లు నాకు చాలా నచ్చాయి. “తిలక్ కథలు” గురించి రాస్తూ ఆయన బావున్నాయి అంటూ ఉదాహరించిన 5 కథల్లో 4 నాకు నచ్చిన కథలు కావడం నన్ను థ్రిల్ కి గురిచేసింది. నా బ్లాగు లో కూడా ఆ నాలుగు కథల గురించి రాసినట్లు ఉన్నా. ఐతే అప్పటికి నేను చదివిన ఎడిషన్ లో ఉన్నన్ని కథలు వెలుగులోకి రాలేదు అనుకుంటా. అందువల్లే ఏమో కొన్ని కథల పేర్లు కనబళ్ళేదు ఆ వ్యాసం లో.

చలం గురించి రాసిన వ్యాసాలు ఆసక్తి కరంగా ఉన్నాయి. నేను చదివిందల్లా “మైదానం” ఒక్కటే చలం కి సంబంధించినంత వరకు. అందరూ విపరీతంగా పొగడగా విని చదివింది అది. కానీ శైలి పరంగా అది విపరీతంగా నచ్చినా కథా పరంగా నాకు నచ్చలేదు. “చాలా వాటికి క్షమించాలి చెలాన్ని” అన్న వ్యాసం లో “మైదానం” గురించి రాసిన భాగం లో కథా పరంగా దానిలో ఉన్న బలహీనత లను చక్కగా చర్చించారు. నాకు ఆ వ్యాసం ఎంతో ఉపకరించింది. నవీన్ కి చలం అంటే బాగా అభిమానం అనుకుంటా. లేదా ఆయన ప్రభావం అన్నా ఎక్కువ అనుకుంటా ఈయన మీద. “చెదిరిన స్వప్నాలు” చదువుతున్నప్పుడు వచ్చిన అనుమానం ఇది. ఈ పుస్తకం లో చలం పై రాసిన 5,6 వ్యాసాలతో ఆయన్ని నవీన్ ఎంతగా అధ్యయనం చేసారో అర్థం అవుతోంది.

మొత్తానికైతే ఈ వ్యాసాలు నాలో మరింత ఆసక్తి ని రేకెత్తించాయి సాహిత్యం మీద. నవీన్ ఎంత లోతుగా పరిశీలించారో ! అన్న ఆశ్చర్యం కూడా కలిగించాయి. విమర్శ అంటే ఇలా ఉండాలి అనిపించింది నాకు. నేను ఎక్కువ విమర్శలు చదవలేదు కానీ నవీన్ వ్యాసాలు పాఠకురాలి గా నాకు ఎంతో ఉపకరిస్తున్నాయి. ఇక ముందు చదవబోయే సాహిత్యాన్ని కాస్త లోతు గా చదువుతానేమో అని అనుమానం 🙂 సాహితీ ప్రియులు అందరూ చదవాల్సిన సంకలనం ఇది.

Advertisements
Published in: on September 15, 2006 at 5:02 am  Comments (3)  

The URI to TrackBack this entry is: https://vbsowmya.wordpress.com/2006/09/15/sahitya-vyaasaalu/trackback/

RSS feed for comments on this post.

3 CommentsLeave a comment

 1. baagundi vyaasam. Naveen chalam paina study chEstE nuvvu Naveen pai study chEstunnaTTu unnaav. mundu mundu nuvvu kuuDaa pedda rachayitri ayipOyi ilaa vyaasaalu raastaavEmO! evariki telusu?

 2. chaala bagundi…
  got inspired by ur discription..
  okappudu chadivevadini…navalalu…poetry…etc…
  but busy valla chadavadam kudaratledu..
  but ee vyasam chadivina taruvatha…decided to start again…
  try chestanu…
  any way thanks…
  i hope phanindra cheppindi nijam avutundi eno…
  evariki telusu…!!!

 3. Sowmya,
  Unfortunately I missed you in Doctor’s house. You were left the meeting suddenly. Last week I saw this article. But I don’t have time to write my comments.
  ” Chlam Kalam padite Aasetu Himachalam kooda karigi kaneeraindi ” idi na mata kadu. Evaro annarani, Chepparani ” Mydanam ” chadivite meeru chala miss avutaru. ” Daivamichina Bharya ” chadavdam modalu pettandi mundu. Taruvata ” Premalekhalu “. Here I am not comfortable to explain the greatness of Him. But he is Ultimate.
  ” Puttagane na noti nundi veluvadda edupu nee kosame ! moorkhulu veellu…, pala kosamanukunnaru ” These line from Chalam Premalekhalu.

  -Praveen
  ” Nadustunte Cheema naligina Savvadi..
  Navvutune Amrutam Kurisina sangati..
  Evvarooo gamanincha leru……
  Hrudayamantoo vunte tappa !!


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: