Ampasayya

        “అంపశయ్య” ఒక తరం యువత ని ఓ ఊపు ఊపిన నవల గా చెప్పొచ్చు అనుకుంటా. నవీన్ ని అంపశయ్య నవీన్ గా మార్చింది ఈ నవలే. ’69 లోనో ఎప్పుడో వచ్చిందట పుస్తకంగా.ఇప్పటికీ చదువరులని ఆకర్షిస్తూనే ఉంది. ఇవన్నీ అటుపెడితే ఇది “చైతన్య స్రవంతి” అని తెలుగు సాహిత్యం లో పిలుచుకునే “Stream of Consciousness ” లో రాయబడిన నవల. ఒక కాలేజీ కురాడి జీవితం లో ఒక రోజు లో … సరిగ్గా చెప్పాలంటే 14 గంటల్లో జరిగిన జీవితాన్ని చిత్రీకరిస్తుంది ఈ నవల.

         ఎక్కడ వర్ణనలు ఉండాలో, ఎక్కడ ఉండకూడదో నాకు తెలీదు కానీ .. ఈ రచన లో మాత్రం చాలా తెలివి గా వాడారు వర్ణనలని. ఎ ఒక్క వర్ణనా అనవసరం అనిపించలేదు. మంచి ఫ్లో ఉంది. కథా వస్తువు పరంగా కొన్ని చోట్ల నాకంతగా నచ్చలేదు …. ఈ ఇతివ్రుత్తంలో కాలేజీ జీవితం అన్నది తప్ప మిగితా భాగాన్ని ఫీలై చదవలేకపోయినందుకు కావొచ్చు. అంటే కొన్ని విషయాల్లో అబ్బాయిల మనోభావాలూ  ఇవన్నీ నేను అనుభవించలేదు కదా….. సో కొన్ని చోట్ల – “ఇలా కూడా ఆలోచిస్తారా?” అనిపించింది. 🙂 ఈ ఆర్టికిల్ చదువుతున్న అబ్బాయిలూ… నా మీదకి యుధ్ధానికి రాకండి. 😉

         ఐతే నా వ్యక్తిగత భావాలు పక్కన పెడితే దీనిలో జీవితం ఉంది.  ఇది చదువుతూ ఉంటే “జీవితమొక చైతన్య స్రవంతి” అనుకున్నా మరోసారి. ఇంకా … వాక్యాల్లో ఓ విధమైన రిథం ఉంది. అది చదువుతూంటే ఓ మంచి అనుభూతి ని ఇచ్చింది. నాకు వచనం లో ఉండే కవితాత్మకత ఇష్టం. (ఈ వాక్యం వడ్డెర చండీ దాస్ గారిది … కానీ నా ఇష్టానికి అక్షరరూపం ఇచ్చింది కాబట్టి ఇలా వాడేసుకుంటున్నా.:)).అసలే కవితాత్మకత లేదు అనుకున్న మరుక్షణమే వచనం లో కవిత్వం దర్శనమిచ్చింది ఇందులో. అది కూడా ఓ మంచి అనుభూతి .. దీన్ని చదువుతూఉంటే.

          మంచి భావాలు ఉన్నాయి.  సింపుల్ గా పొందిగ్గా చిన్న చిన్న వాక్యాల్లో జీవిత సత్యాలు చెప్పడం నాకు నచ్చింది. ఆదర్శాలకూ ,  నిజ జీవితానికి మధ్య జీవించడం మీద రవి కీ ఉపెంద్ర సార్ కీ జరిగిన చర్చ ఆలోచింపజేసింది.  రవి (హీరో) అంతరంగం లో మంచి-చెడు, అవును-కాదు తరహా చర్చలు ప్రాసెస్స్ అయ్యే తీరుని వర్ణించిన తీరు లో చాలా స్పష్టత ఉందనిపించింది.

          ఇక ..చివరగా చెప్పాలంటే మంచి నవల. చదివింపజేసేది. ఐతే “అంపశయ్య” అని కలవరించి కలవరించి చదివినందుకో ఏమో మరి నేను ఊహించినంత నచ్చలేదు. ఈ 45 రోజుల్లో చాలానే చదివా నవీన్ రచనల్ని. ఆ అనుభవంతో నాకు నాకు చాలా మంది చెప్పినట్లు :”అంపశయ్య ఈజ్ ది బెష్ట్” అనిపించలేదు. నాకు ఇప్పటికి కూడా “కాలరేఖలు”, “చెదిరిన స్వప్నాలు” నే ఫేవరెట్స్. అయితే, చైతన్య స్రవంతి అంటే జీవితం … జీవితమే చైతన్య స్రవంతి అన్న నా నమ్మకం మరో సారి నిలబెట్టింది అంపశయ్య. అన్నట్లు ఇన్ని చెప్పి ఈ పుస్తకం నాకు చదవమని ఇచ్చిన నేస్తానికి థాంక్స్ చెప్పుకోకుంటే ఎలా? చెప్పుకుని తీరాలి.    చైతన్య స్రవంతి లోకి మరోసారి పంపినందుకు …. జీవితమొక చైతన్య స్రవంతి అని మరోసారి అనిపించేలా చేసినందుకు … 🙂    
 

          

Advertisements
Published in: on August 26, 2006 at 5:16 am  Comments (9)  

The URI to TrackBack this entry is: https://vbsowmya.wordpress.com/2006/08/26/ampasayya/trackback/

RSS feed for comments on this post.

9 CommentsLeave a comment

 1. అంపశయ్య నవల విమర్శ బాగుంది.సమీక్షలో వాడిన పదాలు ,అభిప్రాయం,వ్యక్త పరిచిన తీరు, పూర్వపు సమీక్షలతొ పోలిస్తే మెరుగయ్యింది.

 2. u write in telugu.. kewl.. i have no idea wat u av written 😛

 3. hammayyaa! innaaLLaki nEnu chadivina pustakam pai samiiksha kaabaTTi naakuu konta cheppukunE avakaaSam dakkindi.

  “ampaSayya” nannu bore koTTakunDaa chadivimpa chEsina navala. chaala mandi college abbaayila dainika sangarshana ki idi akshara ruupam anukOvacchu. ayitE rachayita konni saarlu marii “realistic” gaa unDE prayatnamlO raasina varNanalu konchem ibbandi peDataay.

  ika jiivitam chaitanya sravantO kaadO naaku teliyadu kaanii, ii pustakam lO kathaa naayakuDilaa atigaa aalOchistuu, oka sthiramaina nirNayam tiisukOlEkapOvaDam anta mElu cheyyadani naa abhipraayam!

  manchi review! Thanks! chivaralO raasina konni vaakyaalaki pretyEkamaina thanks 🙂

 4. Hey Sowmya..

  Where can I get Naveen’s novels.. I mean any soft copies ?

  I’ll put my comments after reading the novel myself..

  Nice blog..

  Sudhakar

 5. మీ భాష , భావ వ్యక్తీకరణ బాగుంది. బ్లాగూ బాగుంది ..

 6. Dear Sudhakar Sir,

  You were asking Ms Soumya about availability of Naveen’s Novels. His books are available in all leading book stalls like Vishalandhra etc. Or you can call directly to his residence phone no +918702456458 for copies or catelogue of the books.

  Thanks and bye

 7. మీరు అంపశయ్య అంపశయ్య అని పదే పదే తలవడం వల్ల ఈ నవల నుండి నా అపేక్ష కూడా ఆకాశాన్నంటాయి.
  కానీ సమీక్ష నా అపేక్షలని ఉపేక్షించింది 🙂 కాని ఒ అమ్మాయిగా ఇంత వ్రాసారంతే, చాలా మెరుగే.

 8. TODAY IE 24-12-2009 IS SRI AMPASAYYA NAVEEN’S BIRTH DAY. I CAME TO KNOW THAT HIS NOVELS ” PRAYANAMULO PRAMADALU” & “BANDHITHULU” WERE REPRINTED AND TO BE RELEASED TODAY. BUT DUE TO TELANGANA BUNDH THE PROGRAM WAS POSTPONED. I WAS REALLY DISAPPOINTED AS I WANTED TO TAKE PART IN THE PROGRAM. I HAVE READ THE NOVEL PRAYANAMULO PRAMADALU, WHICH WAS REALLY SUPERB AND MAKES US TO READ ENTIRE NOVEL IN ONE GO AS IT NARRATES THE DANGERS AND PLEASANTRIES OF EXCURSIONS UNDERTAKEN BY GROUP OF GIRL STUDENTS FROM ONE COLLEGE. THE TWISTS AND TURNS DURING THE JOURNEY INVOKES LOT OF EXCITEMENT TO THE READER.
  ONE HAS TO READ THIS MASTER PIECE NOVEL WITHOUT FAIL.

  -APOORVA
  HANAMKONDA
  WARANGAL-INDIA

 9. YES I AGREE WITH APOORVA’S VIEWS ON NAVEEN’S NOVEL “PRAMADAMULO PRAMADALU”. I HAVE NOT READ THE NOVEL BUT I HEARD THAT ITS AN EXCELLENT NOVEL. I AM EAGERLY LOOKING FORWARD TO ATTENDING THE PROGRAM POSTPONED.
  APOORVA LET ME KNOW THE DATE & PLACE OF THE PROGRAM.

  ANANYA


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: