Maro 4 naveen navalalu

మళ్ళీ కొన్నాళ్ళ తరువాత తెలుగు లోకి. మిగితా నవీన్ నవలలు చదివిన టైం లోనే ఈ “నవీన్ నవలలు – మూడో సంపుటం” చదివాను. ఐతే కొన్ని కారణాల వల్ల అప్పుడు బ్లాగ్ చెయ్యలేక ఇప్పుడు చేస్తున్నా. ఇందులో నాలుగు నవలలు ఉన్నాయి. ఇదివరలో రాసిన రెండో సంపుటం తో పోలిస్తే ఇది బాగుంది. దానితో పోలిస్తే మాత్రమే సుమా !! 🙂

మొదటి నవల – “తారు-మారు”. మంచి శైలి లో సాగింది. సమస్య ను బాగా చర్చించారు. బాగానే విశ్లేషించినట్లు కూడా అనిపించింది. ఐతే ముగింపు నాకంత నచ్చలేదు. 75% కథ ముగిసాక అంతా కక్ష సాధింపు ధోరణి లా అనిపించింది కథా నాయిక పాత్రది. కథ మొదలైనప్పుడు దీనికి ఏదో సామాజిక ప్రయోజనం ఉంది అన్న భావం తో మొదలుపెట్టా. సినాప్సిస్ చదివి. కానీ ముగింపు కి వచ్చేసరికి ఇలా ముగించడం వల్ల ఏం లాభం? అనిపించింది. విషయానికి సామాజిక ప్రయోజనం ఉన్నా కూడా ముగింపు కారణంగా రచయిత తన పాయింట్ ని సరిగా చెప్పలేకపోయాడేమో అనిపించింది.

ఇక రెండోది – “చెమ్మగిల్లని కన్నులు”. మామూలుగా అనిపించింది. పెద్ద ప్రత్యేకత ఏం లేదు. ప్రేమ అన్న ఒక్క వస్తువు మీద వచ్చిన ఎన్నో నవలలో ఇదీ ఒకటి అనుకుంటా. అంతకు మించి ఇందులో అంతగా చదివించే విశేషమేం లేదు.

మూడోది – “విచలిత”. కొన్ని సన్నివేశాలు పేర్లు మార్చిన “చెదిరిన స్వప్నాలు” లా అనిపించాయి. రచయిత అభ్యుదయ వాదం తో రాసినట్లు అనిపిస్తుంది ఈ నవల చదువుతూ ఉంటే. ఐతే కొన్ని చోట్ల అతి గా కూడా అనిపించింది. ఏమో దాన్నే దొరల భాష లో Candidness అంటారేమో ! అంత పచ్చి నిజాన్ని భరించే శక్తి లేక నాకు అలా అనిపించిందేమో !! “అదే జీవితం” – అంటారేమో … అది మీ ఇష్టం. ఐతే శైలి పరంగా బాగుంది. కథా పరంగా ఆలోచింపజేసింది. కొన్ని చోట్ల అతిగా అనిపించినా కూడా కొన్ని చోట్ల కదిలించింది కూడా.

నాలుగోది “సౌజన్య”. బాగా రాశారు. ఐతే కొన్ని చోట్ల రొటీన్ గా అనిపించింది. కానీ దానికి నా అత్యాశ కారణమనుకుంటా. ప్రతి సారీ ఓ కొత్త పద్ధతి లో రాయడం ఏ రచయిత కైనా అసాధ్యం ఏమో.

ఈ నాల్గింటి లోనూ కొన్నిటి రచనా వస్తువు చలం ని గుర్తు తెచ్చింది. అంటే అలాంటి కథలు చలం మాత్రమే రాయాలని కాదు. అలాంటి వస్తువనగానే మమూలుగా గుర్తు వచ్చే వ్యక్తి చలం. అంతే. పోయిన సారి రాసిన “4 నవీన్ నవలలు” లోనూ ఇందులోనూ నాకు కాలరేఖలు త్రయం లోని సన్నివేశాలు కొన్ని యథాతథంగా పాత్రలు పేరు మాత్రం మారాయి అంతే. ఐతే ఇలాంటివి సహజం అనుకుంటా ఒక వ్యక్తి అన్ని నవలలు రాసినప్పుడు.

మొత్తానికైతే పక్కా  టైంపాస్ పుస్తకం అనిపించింది. దీనిలో బోలెడు సార్లు రెఫర్ చేసిన “నవీన్ నవలలు-రెండో సంపుటం” గురించి నా అభిప్రాయాలు ఇక్కడ చూడండి.

Advertisements
Published in: on August 24, 2006 at 5:35 am  Comments (2)  

The URI to TrackBack this entry is: https://vbsowmya.wordpress.com/2006/08/24/maro-4-naveen-navalalu/trackback/

RSS feed for comments on this post.

2 CommentsLeave a comment

  1. naveen ani pEru peTTukunnanta maatraana prati navalaa naviinamgaa, pravINamgaa unDaalani lEdu kadaa! sowmya ani pEru unna vaaLLantaa sowmyamgaa unTaaraa cheppu? 🙂

    ii article baagundi. chaalaa jaagrattagaa, Emaainaa baagulEdu anipistE adi nii aalOchanaa, ishTaalu vallE ani cheppaDam nii vinamratanii, objectiveness nii suuchistOndi. idE ii article ki vanne tecchindi.

  2. Hi sowmya
    Naaku director vamshi raasina novels annee (telugu lipi lo) kavali nee daggira vunte blog lo pedite baguntundi leda mail id ki PDF format lo send cheste santoshistam..
    thanks
    satish


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: