4 Naveen Navalalu

                వరుస గా నవీన్ నవల లు చదువుతూ వస్తున్నా. ఆ క్రమం లో కాలరేఖలు ట్రైయాలజీ తరువాత రక్తకాసారం అయింది. ఇప్పుడు ఈ – ‘ నవీన్ నవలలు – రెండో సంపుటం ‘. ఇందులో నాలుగు చిన్న చిన్న నవలలు ( నవలికలు అనుకోండి ) ఉన్నాయి.  వివిధ పత్రికల్లో వచ్చినవే. అయితే ముందు నాలుగు చదివితే కలిగే ఉద్వేగం , ముందు నాల్గింటిలో ఉన్న పట్టు ఈ నాల్గింటిలో ఒక్కదానిలో కూడా కనిపించలేదు నాకు.  (ముందు నాలుగంటే కాలరేఖలు త్రయం + రక్తకాసారం) 

          మొదటి నవల – ‘ మనోరణ్యం ‘. 5 గురు మిత్రులు ఓ చోట కలుసుకున్నప్పుడు వాళ్ళ మధ్య సంభాషణలు , వాళ్ళ మనో భావాలూ ఈ విధంగా సాగుతుంది కథ. అయితే ఎందుకో నాకు ఆ కథలోని డైలాగులే కొన్ని క్రుత్రిమంగా అనిపించాయి. దీనికి నేను నవలాకారుణ్ణి విమర్శించను. నాకు సహజత్వం నచ్చుతుందని మాత్రమే చెప్తున్నా. నా పంథా లో చేసే పరిచయం మాత్రమే ఇది … నవలా సమీక్ష కాదు. ఇక మళ్ళీ విషయంలోకొస్తే – కొన్ని చొట్ల వాక్యాలు అర్థం కాలేదు. ముఖ్యంగా ఇది – ” ఎందుకనో గానీ ఆమె కళ్ళళ్ళో విపరీతమైన అలసట , విసుగు కనిపిస్తాయి.  అలా కనిపించడం వల్లనే ఏమో ఆమె మామూలు స్త్రీలకంటే కొంత ఉన్నతమైన సంస్కారం కల్గిన దానిలా అనిపిస్తుంది “. నాకైతే ఇలా రాయడం లో పరమార్థం ఏంటో అర్హ్తం కాలేదు.

       అయితే .. వర్ణన లు బాగున్నాయి ఈ నవలలో.  ఒక్కో వ్యక్తి రూపు రేఖల్ని వర్ణించిన తీరు కళ్ళకు కట్టినట్లు ఉంది.  ఇంకా … ఈ ఐదుగురు పాఖాల అన్న ఊరికి వెల్తారు. అక్కడి చరిత్ర ను గూర్చి వీరికి సూర్యం వర్ణించిన తీరు కూడా చాలా బాగుంది. ‘ విషాదం ఆమె పెద్ద పెద్ద కన్నుల మీద కూర్చున్నట్లు గా అవి కిందకు వాలాయి ‘ వంటి వర్ణనలు బాగున్నాయి.

      రెండో నవల ‘ తీరని దాహం ‘. ఇందులో కథ అంటూ చెప్పుకోదగ్గది ఏం లేదు. నాకు రొటీన్ గానే అనిపించింది.  కాకపోతే కొన్ని చోట్ల వర్ణనలు బాగున్నాయి.  ‘ నేను ‘ కి నిహారిక పై గల ఫీలింగ్స్ బాగా చూపారు. ఇంకా రచైత కి అతని అభిమాని వరూధిని కి మధ్య నడిచే లేఖల్లో కొన్ని మంచి కవితా భావాలు ఉన్నాయి. అయితే వైవిధ్యం లేదు అనిపించింది. చిన్న కథని చాలా కష్టపడి నవల గా మార్చినట్లు అనిపించింది.

      మూడొది – ‘ మౌన రాగాలు ‘. ఇది నన్ను చాలా నిరాశ కు గురిచేసిన నవల.  రచైత కంఫ్యూజ్ అయ్యాడా నేను అయ్యానా అర్థం కావడం లేదు. అసలు ఆయన చెప్పదలుచున్న విషయం సరిగా అర్థం కాలేదు. కథ గమ్యం చేరడానికి బోలెడు దారులు ఉంటే ఎటు వెళ్ళాలో తెలీక అన్నింటిలోనూ కాలు పెట్టి చివర్న కష్టపడి వచ్చిందో లేదో తెలీని గమ్యం చేరినట్లనిపించింది.

      చివరిది – ‘సంకెళ్ళు ‘. మొదటి మూడూ పర్వాలేదనిపించేలా ఉన్నాయి. కనీసం కథా గమనం కాకుంటే వర్ణనలో లేక కొన్ని చొట్ల సాగిన అనాలసిస్సో బాగున్నాయి. ఉ ఇది చాలా సాధారణంగా అనిపించింది.  అయితే కాస్త అభ్యుదయ వాదం ఉన్నట్లు తోసుంది. మరి ఇది రాసినప్పుడు అప్పటి జనాలు ఎలా స్పందించారో ఏమో. 

     మొత్తానికైతే పెద్ద గా ఆసక్తికరమైన దేమీ కాదు.  ఏదో అలా కాలక్షేపానికి చదివేది. ముందే నవీన్ నవలలు చదివి ఉండి ఆయని శైలి ని చదవడానికి చదివితే చదవొచ్చు.  అది కూడా నాలా ఎక్కువ ఆశించి చదివితే నిరాశ చెందినా చెందొచ్చు. 🙂

Advertisements
Published in: on August 8, 2006 at 6:01 am  Comments (2)  

The URI to TrackBack this entry is: https://vbsowmya.wordpress.com/2006/08/08/4-naveen-navalalu/trackback/

RSS feed for comments on this post.

2 CommentsLeave a comment

  1. baagundi! aaSa unnappuDu niraaSaa unDaka tappadu ani swaanubhavamgaa grahinchaaru anna maaTa 🙂

  2. […] మొత్తానికైతే పకా టైంపాస్ పుస్తకం అనిపించింది.  దీనిలో బోలెడు సార్లు రెఫర్ చేసిన “నవీన్ నవలలు-రెండో సంపుటం” గురించి నా అభిప్రాయాలు ఇక్కడ చూడండి.   […]


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: