raktakaasaaram – Naveen

                ‘ రక్తకాసారం ‘ అన్నది నవీన్ నక్సల్ సమస్య ని చర్చిస్తూ రాసిన నవల. నవల కల్పితం అన్నట్లే మొదలుపెట్టారు కానీ అది నిజం అన్న విషయం మనకి అందరికీ తెలుసు. అన్నింటికీ ఆ మారుపేర్లోటి పెట్టారు కానీ లేకుంటే ఇక అంతా పియర్స్ సోపు లా ఉండేది. ఇది దీనికి ముందు చదివిన మూడు నవీన్ నవలల కంటే భిన్నంగా ఉంది. కాస్త వ్యంగ్యం ఉన్నందుకో ఏమో. ఇది అని చెప్పలేను కానీ ఇందులో మిగితా మూడింటితో పోలిస్తే ఏదో తేడా ఉంది. ఏమైనా ఇది ఆలోచింపజేసే నవల.  నవల అనాలో లేక ఇంకేమన్నా అనాలో తెలీడం లేదు. ఎందుకంటే ఇది ఒక కథ కాదు. ఒకే విషయం పై రకరకాల కేస్ స్టడీ ల సంకలనం అని చెప్పొచ్చు.

           కథా ప్రారంభం లో జరిగిన సంఘటన తరువాత 5 అధ్యాపకులు విశ్వవిద్యాలయం గదిలో కూర్చుని సమస్య ని గురించి చర్చిస్తారు. ఆ చర్చ చాలా ఆసక్తికరంగా సాగింది. పుస్తకం ఆద్యంతమూ కనిపించే ఇటువంటి చర్చలు చాలా ఆలోచింపజేస్తాయి. ఇదివరకటి నా అభిప్రాయాన్ని కాస్త మార్చాయి ఈ చర్చలు. అంటే వాటంతట అవి మార్చలేదు. కానీ ఈ చర్చలు తెలిపిన కొత్త విషయాలతో నా అభిప్రాయాలు కాస్త మారాయి.
 
           ఇందులో ఒక్కో ఎపిసోడ్ లాగా తీసుకుని సుమారు ఓ 10 కేసులు ఓ 7,8 ఊర్లు బోలేడంత మంది మనుష్యులూ – ఇలా ఎన్నో పార్శ్వాల నుంచి చెప్పి మనలో ఆలోచనలు రేకెత్తించారు.  ఒక్కో చోట నక్సల్స్ ఆలోచనల్లోని తప్పును చాలా చక్కగా చూపారు. తప్పు అంటే ఇక్కడ నేను అంటున్నది వాళ్ళ సిధ్ధాంతాల గురించి కాదు ….  సానుభూతి పరులు అపార్థం చేసుకోకండి. నేను అంటున్నది ఆలోచనా విధానం లోని తప్పును గూర్చి. రచైత ఈ విషయం లో చాలా తెలివి గా  వ్యవహరించారు. ఎవరినీ సమర్థించడు .. ఎవరినీ విమర్శించడు.   విషయం మనముందు ఉంచుతాడు. అంతే.  ఈ పుస్తకం చదివాక మీకేమన్నా అభిప్రాయం ఏర్పడితే అది నిస్సంకోచంగా మీదే .. రచయిత తో సంబంధం లేదు.

                 ఇక కేసుల విషయానికొస్తే ఇవి అన్నీ ఒకటే తరహా కేసులే. నక్సల్ ప్రాబల్యం ఉన్న ప్రతి ఊరిలోనూ జరిగే కథలే. అయితే మళ్ళీ నాకు నవీన్ రచనా శైలి నచ్చింది.  సీరియస్ విషయమై రాసాడు నిజమే.  అది మనల్ని ఆలోచింపజేస్తుంది , నిజమే. అయితే ఏ విషయాన్నైనా చెప్పె పద్దతి లో చెప్తేనే తలకెక్కుతుంది.  అది ఈ శైలి లో ఉంది. దాదాపు కేసులన్నీ భూస్వాములు – జీతగాళ్ళు –  నక్సల్ ఉద్యమం – భూస్వాముల ను నక్సల్స్ చంపడం , పోలీసుల ఎంకౌంటర్లు ఇవే నేపధ్యం లో నడుస్తాయి.
 
                 పోలీసుల బూటకపు ఎంకౌంటర్లు వాటికి నక్సల్స్ ప్రతీకార చర్యలు , మధ్యన బలైన అమాయకులు అర్థం లేని పగలు – అన్నీ మనల్ని ఆలోచింపజేస్తాయి. కాస్త దిగులుకి కూడా గురిచేస్తాయి. ఇందులో ఎన్నో చోట్ల ఘనత వహించిన మన  ప్రజాస్వమ్యం లోని సామాన్యుడి అభిప్రాయాల తోనే ఎన్నో విషయాలు చెప్పారు రచయిత.  నక్సల్స్ ప్రభుత్వం చర్చల గురించి చాలా బాగా రాసినట్లు అనిపించింది.

                మొతానికైతే చదవదగ్గ పుస్తకం. హాస్యానికి తావులేని సీరియస్ విషయం. ఐనా  బుర్ర వేడెక్కకుండా ఆలోచింపజేసిన నేర్పు రచయిత సొంతం. ఎన్నో విషయాలు తెలిపే పుస్తకం. ఆలోచింపజేసేది.  

Advertisements
Published in: on August 5, 2006 at 10:15 am  Comments (6)  

The URI to TrackBack this entry is: https://vbsowmya.wordpress.com/2006/08/05/raktakaasaaram-naveen/trackback/

RSS feed for comments on this post.

6 CommentsLeave a comment

  1. the first telugu blog i have seen in blogroll
    it would be nice if the page could be viewed on firefox too

  2. I am able to view it in firefox.(without any extra plugins,etc.)

  3. firefox rocks!1

  4. Good article Sowmyaa! naxals samasya gurinchi nenuu konta aalochinchaanu kaabatti ii pustakam chadavadam marinta upakaristundi anukuntunnaa.

    inta serious article lOnuu “antaa pears soap laa unDEdi” ani konchem saradaagaa vaaDaTam baagundi 🙂 nuvvu aa soap ki emainaa campaigning chestunnaavaa EmiTi?

  5. Great Blog!

  6. What is needed is solution to the problem. Is the problem beyond solution?


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: