baandavyaalu – naveen

‘ బాందవ్యాలు ‘ – తెలంగాణా జీవన చిత్రాన్ని చూపిన నవీన్ నవలా త్రయం లో మూడోది. మొదటి రెండూ ‘ కాలరేఖలు ‘ , ‘చెదిరిన స్వప్నాలు ‘. ( ఇదంతా ముందు ఆర్టికిల్స్ లో చెప్పా అనుకోండి .. కానీ మొదట ఇది చదువుతున్న వారి కోసం ఈ పరిచయం).

ఈ నవల లో తెలంగాణ భాష ప్రభావం చాలా తగ్గిపోయినట్లు కనిపిస్తుంది. కథానాయకుడి పాత్ర లో ఎక్కడో ఒకటీ రెండు చోట్ల తప్ప ఆ యాస కనబడదు. అయితే దానికి నవల మొదట్లోనే వివరణ ఇచ్చుకున్నాడు రచయిత. ఇంకా …. శైలి పరంగా ఈ నవల ఇది వరకటివాటిలాగే చదివించేలా ఉన్నా కూడా పాత్రల పరిణామం నాకు చాలా నిరాశ కలిగించిన విషయం. ఇది మిగితా రెంటికంటే వర్ణనాత్మకంగా , ఇంకా వ్యక్తిగత కథ లా ఉంది.

కథా కాలం ’69 తెలంగాణా ఉద్యమం మొదలుకొని 90 ల దాకా. ఇందులో ఎక్కువ భాగం మధ్య తరగతి కుటుంబాల జీవన విధానం గురించే. వాళ్ళ కష్టాలు , కోపాలు , అసూయలు , అపోహలు వగైరాలు. బందుమిత్రుల దగ్గర లేని పోని ఆడంబరాలకు పోవడం , వదిన – ఆడపడుచుల సంబంధాలు , తండ్రీ కొడుకుల సంభాషణ లు , మీకు మీ వాళ్ళంటేనే ఇష్టం అనే భార్య ఎత్తిపొడుపులూ , అభిమానాలు – గొడవలూ , తనకు డబ్బు లేదని పుట్టింటి వారు విలువివ్వలేదన్న న్యూనతా భావం ఇలా ఎన్నో పాత్రల ద్వారా చూపిన విషయాలన్నీ ఇది సామాన్యుడి కథ అని మరోసారి నిరూపిస్తాయి.

కథ లో భాగంగా ఆనాటి రాజకీయ చిత్రం , దానిలో క్రమంగా వచ్చిన మార్పులు అన్నీ చూస్తాం. కథా నాయకుడు నరేందర్ ( మొదటి రెండు భాగాల్లో రాజు ) కి డైరీ రాసే అలవాటు ఉంటుంది. ప్రతి ఏటా అతను 31 డిసెంబర్ నాడు డైరీ రాస్తూ ఉంటాడు. కథ ఎక్కువగా ఆ డైరీ లోని పజీలలోనే నడుస్తుంది. కథ ను ఇలా నడిపించడం లో ఎక్కువ విషయాలు చర్చించొచ్చు అనో ఎమో మరి రచయిత అభిప్రాయం. అర్థం కాలేదు. ఇందులో ఆత్మ ఘోష ఎక్కువగా కనిపిస్తుంది. అంటే నరేందర్ జీవితం , అతను పడే బాధా అతని చుట్టుపక్కల జరిగే విషయాలకు అతను స్పందించే తీరు , వాటిపై అతని ఆలోచనలు వగైరా.

నరేందర్ ఇల్లు కట్టే సమయం లో అతని ఆలోచనలు , అతని కి ఎదురైన అనుభవాలు అన్నీ చాలా సహజంగా ఉన్నాయి. అప్పుడప్పుడే మొదలైన ఎంట్రన్స్ టెస్ట్ల హవా గురించి , విద్యార్థులపై దాని ప్రభావం గురించీ విపులంగా చర్చించారు. రామనాథం , నరేందర్ ల మధ్య పెళ్ళి సాంప్రదాయం వంటి విషయాలపై జరిగే చర్చలు ఆసక్తికరంగా ఉన్నాయి. చిట్ఫండ్ కంపనీ ల గురించీ , నక్సల్ ఉదయమం గురించీ ఇలా సమకాలీన సమస్యలు ఎన్నింటినో చర్చించారు. కొన్ని చోట్ల చక్కగా విశ్లేషించారు.

ఈ నవల లో కథానాయకుడి ఆలోచనల్లో మునుపు లేని తాత్వికత కనిపిస్తుంది. ఇక ఆద్యంతమూ వైరాగ్యం వస్తూ పోతూ ఉంటుంది. వయసు పెరిగే కొద్దీ పెరిగే ఆలొచనల వల్ల కావొచ్చు. రామనాథం మరణం నరేందర్ ని తీవ్రమైన నిస్ప్రుహ కి గురి చేస్తుంది. ఆ సమయం లో అతను రామనాథం తో తను పంచుకున్న అనుభూతుల్ని నెమరువేసుకుంటూ ఉంటే నేనూ కాసేపు నరేందర్నయిపోయా. అంత హ్రుద్యంగా ఉంది ఆ వర్ణన. ఈ నవల లో నాకు కథానాయకుడి పాత్ర చిత్రణ కంటే రామనాథం పాత్ర చిత్రణ నచ్చిహంది. మొదటి రెండు భాగాలు చదివాక రాజు పెద్దయ్యాక ఇలా అవుతాడు అని అనుకున్న ఊహలన్నీ రామనాథానికి అతికినట్లు సరిపోయాయి.

అయితే అసలు హీరో నరేందర్ మారిన తీరు నాకు చాలా నిరాశ కలిగించింది. యువకుడిగా ఉన్నప్పటి నరేందర్ తో పోల్చుకుంటే – ” ఇతనేనా ఆ నరేందర్ ? ” అనుకోక మానము. చివరికొచ్చే సరికి నరేందర్ నీ , మనల్నీ ఒకే రకమైన నిస్సహాయత ఆవరిస్తుంది. చెదిరిన స్వప్నాలు కూడా ఒక లేఖ తోనే ముగిసింది. ఇదీ అంతే. కాకుంటే ఆ లేఖ అ నవల కి హైలైట్ అనిపించింది. కానీ ఈ లేఖ తో నవల ఉన్నట్లుండి ముగిసిపోయిందేమో అనిపించింది. మొదటి రెంటి కంటే ఇందులో స్వగతం పాలు ఎక్కువ.

మొత్తానికైతే మంచి నవలే కానీ మొదటి రెండూ చదివాక మాత్రం అంత నచ్చకపోవచ్చు. ” ఇది నవల కాదు. జీవన స్రవంతి ” అని అన్న ఎ.బి.కె. ప్రసాద్ గారి మాటలు మాత్రం నిజం.

Advertisements
Published in: on August 2, 2006 at 7:16 am  Comments (1)  

The URI to TrackBack this entry is: https://vbsowmya.wordpress.com/2006/08/02/baandavyaalu-naveen/trackback/

RSS feed for comments on this post.

One CommentLeave a comment

  1. baagaa raaSaaranDOy! ii rachanalO endukO kluptata kanipinchindi naaku!

    “nEnuu kaasEpu narEndarni ayipOyaa” anaDamlOnuu, “chivirikocchE sariki narEndar nii manalnii okE rakamaina nissahaayata aavahistundi” anaDamlOnuu, mii rachanaa paTima telustOndi!


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: