chedirina svapnaalu – naveen

             నవీన్ రాసిన నవల -‘ చెదిరిన స్వప్నాలు ‘.ఇది నలభైల నుంచీ తొంభై ల దాకా తెలంగాణా 50 ఏళ్ళ చరిత్ర దారుల్లో నడుస్తూ మనల్ని కూడా నడిపించిన నవలా  త్రయం లో రెండోది.మొదటిది ‘ కాలరేఖలు ‘ .మూడోది-‘ బాందవ్యాలు ‘.నవల చాలా ఆసక్తికరంగా సాగిది.మొదటి భాగం లాగే.భాష తెలంగాణం.ఈ భాగం అంతా 50 లలో పరిస్థితుల నుంచీ 69 లొ తెలంగాణా ఉద్యమం మొదలయ్యేంత వరకూ జరిగిన సంఘటనలతో సాగుతుంది. సంభాషణ ల లోనూ,కథను నడిపించడం లోనూ రచయిత సఫలీక్రుతులయ్యారనే చెప్పాలి.మరో సారి తెలంగాణ జీవితాలను కళ్ళ ముందు సాక్షాత్కరింప జేసారు.

             పంచాయత్ రాజ్ వ్యవస్థ ఆగమనం తో గ్రామాల్లోని ప్రతి అంశం లోకీ రాజకీయాలు ఎలా కాలుమోపాయో చాలా బాగా చూపారు. స్వాతంత్ర్యం వచ్చినా ,దొరల రాజ్యం పోయినా ఎప్పటికైనా దొర గ్రామాన్ని , గ్రామ పెద్దల్ని తన గుప్పిట్లోనే ఉంచుకోవడం ,దొర కు అధికారం పోయినా –
” దొరంటే ఎప్పటికీ దొరే ” అన్న చందాన ప్రజలు భయ భక్తుల్తో మెలగడం , ఊర్లోని గొడవలకు ఆయనే పరిష్కారం చెప్పడం , భూమి  పంపకాల విషయం లో ఎవరి మాటా వినని వెంకయ్య దొర చెప్పగానే – ” చిత్తం ” అని ఒప్పేసుకోవడం అన్నీ చూస్తే మనం నిజంగా స్వతంత్రులమేనా ? అని అనిపిస్తుంది. గ్రామీణ భారతం లోని తెలీనితనాన్ని ,అమాయకత్వాన్నీ , కొన్ని మూఢాచారాలపై వెర్రి నమ్మకాన్ని , ఎన్ని చెప్పినా మానుకోని కులం పట్టింపులనూ , కొందరి మూర్ఖత్వాన్నీ సహజంగా చిత్రించారు. 

             కాలరేఖల్లో బాలుడైన కథానాయకుడు రాజు ఇందులో నవ యువకుడు. కాలేజీ చదువు కి రాజు కి వాళ్ళ నాన్న డబ్బులివ్వడు. వాళ్ళ ఆర్థిక పరిస్థితి కూడా అందుకో కారణం. అయితే అదే నాన్న ఇంటికెవరన్నా వస్తే వాళ్ళకి కల్లు తాగించడానికి , మేకలో కోళ్ళో కోయించడానికి ,లేని పోని ఆడంబరాకూ అప్పులు చేసి మరీ ఖర్చు చేయడం రాజు కి ఆశ్చర్యమే కాదు , విసుగు ను కూడా కలిగిస్తుంది. అదే విచిత్రం – అవసరం అనుకున్న వాటి మీద ఖర్చు చేయడానికైనా వెనకాడతాం కానీ ఎవరో గీసిన పరువు – స్టేటస్ వంటి గీతలు దాటకుండా ఉండడానికి ఏమన్నా చేస్తాం మనం. రాజు చదువుకు పడ్డ కష్టాలు , అతను చెడు మార్గాల పోబోయి మళ్ళీ తన్ను తాను ప్రశ్నించుకుని బయటపడ్డం – మనకు తెలిసిన కథలానే అనిపిస్తుంది. సహజత్వం ఈ పుస్తకానికి మొదటి పేరు.

             రాజు కీ , ఇతర పాత్రలకీ జరిగే చర్చలు నిజంగా చదవదగ్గవి. ఎన్నో సమస్యలనూ , వాటికి గల ఎన్నో  పార్శ్వాలనూ చర్చిస్తారు కథ ఆద్యంతమూ. పంచ వర్ష ప్రణాళికలు , కమ్యూనిస్ట్ భావజాలం , చైనా యుద్ధం , నెహ్రూ పాలన , బ్యాంకుల జాతీయీకరణ , పాక్ యుద్ధం , ఎన్నికలు , లాల్ బహదూర్ శస్త్రి , ఇందిరా ,  స్వరాజ్య పార్టి  ఇలా ఎన్నో విషయాల మీద సమాజం లోని సామాన్యుల మాటలు ఈ నవల లో వింటాం. అలాగే ఆంగ్లం లోనూ ,  ఆంధ్రం లోనూ ఉన్న సాహిత్యం గురించి జరిగే చర్చలు కూడా ఆసక్తికరంగా ఉన్నాయి. ‘ మిత్ర మండలి ‘  లో జరిగే చర్చల గురించి చదువుతూంటే ఆ అధ్భుతమైన ద్రుశ్యం కళ్ళ ముందు కదలాడింది. కాలోజీ నారాయణరావు , కాలోజీ రామేశ్వర రావు వగైరా తెలంగాణా కవులందరూ కలిసే వారట ఆ మండలి సమావేశాల్లో. రాజు పై ఆ సమావేశాల ప్రభావం కూడా కనిపిస్తుంది మనకు కథా గమనం లో.

             ‘ అద్రుష్టవంతుణ్ణి చెడగొట్టేటోడు లేదు , దురద్రుష్టవంతుణ్ణి బాగు చేసేటోడు లేదు ‘ – ఈ మాట ఈ నవల్లో ఓ 7 , 8 సార్లన్నా వచ్చినట్లుంది. కాలరేఖల్లోనూ , బాందవ్యాల్లోనూ కూడా వచ్చింది.  ఒకానొక చోట –
‘ అనుభూతి ని భాష లోకి అనువదిస్తే ఇంత పేలవంగా ఉంటుందా ? ‘ – అనుకుంటాడు రాజు. ఆ క్షణం లో నాకు ఎన్నో సార్లు నేనలా అనుకున్న ఖ్షణాలన్నీ గుర్తు వచ్చాయి. అలాగే –
 ‘ అనుభవాలను వ్యక్తీకరించడానికి భాష ను ఉపయోగిస్తాం. కానీ కొన్ని అనుభవాలు భాష సరిహద్దుల్ని దాటి విస్తరిస్తాయి ‘  – అని రెండు వేర్వేరు సందర్భాల్లో రెండు వేర్వేరు విషయాల పై జాపాన్ కు చెందిన ప్రముఖ తత్వవేత్త డీ టీ సుజుకీ , ప్రముఖ శాస్త్రవేత్త ఐజెంబెర్గ్ ఇద్దరూ వ్యక్తపరచిన అభిప్రాయాలు గుర్తు వచ్చాయి.
(Source : “The Tao of Physics” – Fritjofcapra)

 ‘ కొన్ని సంవేదనల్ని మనలో మనమే మౌనంగా మననం చేసుకోడం లోనే గొప్ప ఆనందం ఉంటుందనిపించింది. వాటిని మాటల్లోకి అనువదించి పదిమందితో పంచుకోవాలని ప్రయత్నిస్తే వాటిలోని అనుభూతి సాంద్రత పలుచబడిపోతుందనిపించింది ‘
     – పై మాటల్లో నాకైతే చాలా నిజం ఉందనిపించింది.

         మొదట కాలరేఖలు చదివి తరువాత ఇది చదివినందుకో ఏమో – రాజు నా కళ్ళ ముందు పెరిగి పెద్దవాడైన అనుభూతి కలిగింది నాకు. గొప్ప రచనంటే అలాంటి తాదాత్మ్యం కలిగించాలి అనిపిస్తాడు రచయిత ఇందులోనే ఓ పాత్రతో. అలాంటి ఓ ఫీలింగ్ దీన్ని చదువుతున్నప్పుడు నాకూ కలిగింది. రోజు రోజుకీ రాజు ఎదుగుదల చూస్తూ ఉంటే నిన్నమొన్నటి దాకా ఎంటో అమాయకంగా ఉండి , అస్సలు ఏమీ తెలియకుండా ఉన్న రాజేనా వీడు అనిపించింది. రాజు భావజాలం అతని మాటల్లో వింటూ వచ్చిన కొద్దీ వామనుడి లా చిన్నవాడనుకున్నా …. ఎంత గా ఎదిగిపోయాడు అనిపించింది.

          అడగడం నుంచి తమ్మునికి చెప్పెవరకూ వచ్చిన రాజు ని ‘ కాలరేఖలు ‘చూపింది. ఇక రాజు కాలేజీ లో అతని ఎదుగుదల , ఎన్నో క్లిష్టమైన విషయాలను అర్థం చేసుకుని తేలిగా అర్థం అయ్యేలా చెప్పగల నేర్పు , అతివాదానికి పోక ప్రశాంతంగా సమస్య ని అతన్ని అర్థం చేసుకునే తీరూ – అంతా ఓ క్రమంలో చూస్తూ నేనేదో రాజు నా ముందే ఇదంతా చేస్తున్న అనుభూతి ని పొందాను. ఓ పిల్లాడిని పెంచి పెద్ద చేసిన తల్లి ఎలాంటి అనుభవం పొందిందో అలాంటిదే ఇది. అలాంటి అనుభవం రచైత పొందడం వేరు. పాఠకుల్లో కూడా కలిగించడం వేరు. రెండోది జరిగిన ఏ నవలన్నా ఉత్తమమైన నవల అని నా అభిప్రాయం. ఇక్కడ జరిగింది అదే.
note:’ కాలరేఖలు ‘ పై నా అభిప్రాయలను ఇక్కడ చూడవచ్చు.

Advertisements
Published in: on July 22, 2006 at 11:12 am  Comments (6)  

The URI to TrackBack this entry is: https://vbsowmya.wordpress.com/2006/07/22/chedirina-svapnaalu-naveen/trackback/

RSS feed for comments on this post.

6 CommentsLeave a comment

 1. goppagaa undi! kathani kluptamgaa oka paralO cheppi, migataa vyaasam antaa mii anubhuutinii, abhipraayaanni cheppaDam baagundi. aa cheppaDam kuuDaa goppagaa, hattukunETaTTu undi. “oka pillaaDini penchina ammalaa Raju edugudalani chuusi nEnu aanandinchaanu” anaDam macchuki okaTi! aksharaala gurinchii, anubhuutula gurinchii miiru cheppinadi kuuDaa “akshara” satyamE!

  mii “baandhavyaala” review kai eduru chuustunnaamu!

 2. Vasireddy Naveen turned to Ampasayya Naveen after his magnum opus అంపశయ్య. It was written using stream of consciousness technique. Sri Naveen is a Kendra Sahitya Academy awardee for the book కాలరేఖలు for the year 2004. At present he is working as Guest Editor for Telugu Naadi, a Telugu monthly from Chicago(IL).

  Your opinion about ’ కాలరేఖలు ‘ at http://www.telugupeople.com/discussion/MultiPageArticle.asp?id=39783&page=2 is unfortunately giving a distorted display of Telugu fonts.To sumup I have to state that your presentation of review is good.

  • Vasireddy Naveen is different from Dr Ampasayya Naveen. Please note that Ampasayya Naveen is not the editor of Naadi, he is a full fledged writer after his retirement from Government service as Principal, Govt Women’s Degree College, Warangal in 1996. The writer lives in Warangal which is his native town. You can log on to http://www.ampashayyanaveen.com for further details about the writer.

   Swapna (swapnapanchan@gmail.com)

 3. The comment made by Sri CB Rao is wrong as Vasireddy Naveen and Ampasayya Naveen are two different individuals. Vasireddy is not a fiction writer. Ampasayya Naveen is a fiction writer and Kendra Sahitya Academy Awardee for his great novel ” Kalarekhalu “. Ampasayya Naveen is a retired Principal from Womens’ Degree College, Warangal and now he is full time writer.

  His novel ” AMERICA..,AMERICA” is now being serialised in the popular Telugu Weekly Magazine Navya.

 4. The comment made by Sri CB Rao is not correct as Vasireddy Naveen and Ampasayya Naveen are two different individuals. VasiReddy Naveen is not a fiction writer. Ampasayya Naveen is a full time writer.


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: