Mithunam – sreeramana

శ్రీరమణ గారి కథల సంపుటి – ‘మిథునం’. అంతా కలిపి 8 కథలున్నాయి – అంతే. అయితే మంచి శైలి,చక్కని చదివించే గుణం,హ్రుద్యమైన చిత్రీకరణా పైకి చూట్టానికి మామూలుగా అనిపించే కథలను చదవడం మంచి అనుభవంగా మిగిల్చాయి. అక్కడక్కడా సున్నితమైన వ్యంగ్యం,ఆద్యంతమూ సునిశితమైన హాస్యమూ,మనసును హత్తుకునే సన్నివేశాలు – అన్నీ కలిప్పితే ఈ ‘మిథునం’.
‘అరటిపువ్వు సాములారు ‘ – ఓ రొటీన్ కథ. కాకుంటే శైలి ఆకర్షణీయంగా ఉండడం తో ఆసక్తికరంగా సాగింది. అయితే ఈ పుస్తకం లో ని కథలన్నింటిలోకీ నాకు నచ్చని కథ ఇదే. మామూలుగా మొదట్నుంచీ చదువుకుంటూ వస్తే బానే అనిపిస్తుంది. కానీ అటు నుంచి నరుక్కొస్తే ఆ కథలన్నీ చదివాక ఇది నచ్చదేమో అని నా అనుమానం. ఇక తరువాతి కథ – ‘తేనెలో చీమ ‘. ఒక్కముక్క లో చెప్పాలంటే –  వ్యంగ్యం లో విషాదాన్నీ , విషాదంలో వ్యంగ్యాన్నీ కలిపిన మిక్స్చర్ పొట్లం. ఓ వైపు కథానాయకుడి (నా ద్రుశ్టి లో నాయకుడు) పాత్రను మలిచిన తీరు అతని పట్ల జాలిని, అతని జీవితం తో ఆడుకున్న మిగితా పాత్రల పట్ల కోపాన్నీ కలిగించినా, అదే సమయం లో పదాల్లోని వ్యంగ్యం ఒకానొక చిరునవ్వును (కనీసం) మన పెదాలపై కురిపిస్తుంది.
‘బంగారు మురుగు ‘  –  పెద్దదైనా మంచి కథ. ఆద్యంతమూ చదువరులపై మంచి పట్టు ఉంచుకునే కథ. బాగా చలింపజేసింది.  ఇందులో జీవ కళ ఉంది. స్టోరీ నెక్స్ట్ డోర్ తరహా కథ.  అందుకే అనుకుంటా కళ్ళకు కట్టినట్లు ఉండింది. ‘వరహాల బావి ‘ – ఈ కథ గురించి చెప్పాలంటే బానే ఉంది. కానీ పై కథలన్నింటిలోనూ ఉన్న చదివించే గుణం (పోనీ నన్ను చదివించే గుణం అనుకోండి) – అది లేదు ఇందులో. ‘మిథునం’ నాకు అన్నింటిలోకీ నాకు చాలా నచ్చిన కథ. భార్యా – భర్తల మధ్య తగాదాలు, సరదాలు, సహజీవనమూ అన్నీ చాలా సహజంగా చూపిన కథ. ఇది నిస్సందేహంగా ఈ పుస్తకం మొత్తానికి ఉత్తమమైన కథ నా వరకైతే.
‘పెళ్ళి ‘ మరో ఆసక్తి కరమైన కథ. సంభాషణలే ప్రధానంగా సాగుతుంది. ఎన్నో విషయాలు అన్యాపదేశంగా చర్చించిన కథ.  అబ్బో! బోలెడు కనీ కనిపించని వ్యంగ్యం, మంచి హాస్యం ఉంది ఈ కథలో. ‘ధన లక్ష్మి ‘ మరో మంచి కథ. ఇదీ ఓ రకంగా భార్యా  భర్తల కథే.’ఇగో’ కథ మొదట్లో కాకపోయినా పావు భాగం అయ్యేసరికి ఇక కథా-పాలనా పగ్గాలు తీసుకుని కథ నడిపించింది. ‘షోడా నాయుడు ‘  – చివరిది. మంచి కథ. సహజబ్గా మన చుట్టు పక్కల వాళ్ళు మాట్లాడుకుంటున్నట్లే అనిపించింది కథంతా.
మొత్తానికైతే మంచి సరదా పుస్తకం, అలాగే కదిలించెది కూడానూ. చదువుతుంటే అక్కడక్కడా ఎంత సీరియస్ మనిషైనా నవ్వుతాడు అని గ్యారంటీ గా చెప్పదగ్గ పుస్తకం. ఉదాహరణకు –
‘నాకా ఊరు ఏమాత్రం నచ్చలేదు. ఇరుకిరుగ్గా రాసేసిన రామకోటి పుస్తకం లా ఉంది ‘ – అన్న పోలిక కి నాకు నవ్వొచ్చింది. కానీ లైబ్రరీ లో జనాలు వింతగా చూస్తారేమో అని ఆపేశా.  ఇంతకీ నా అభిప్రాయం ఏమిటి అంటే ఇది హాయిగా చదవదగ్గ పుస్తకం.  మంచి ఆహ్లాదకరమైన అనుభూతి మిగిల్చే పుస్తకం.

గమనిక: ఇక్కడ నేను చెప్పిన వరుస నేను చదివిన వరుస. పుస్తకం లో ఉన్న వరుస కాదు. గమనించగలరు.

Advertisements
Published in: on July 20, 2006 at 4:16 am  Comments (4)  

The URI to TrackBack this entry is: https://vbsowmya.wordpress.com/2006/07/20/mithunam-sreeramana/trackback/

RSS feed for comments on this post.

4 CommentsLeave a comment

  1. baagundanDii! chakkaTi telugu vaaDi aanandam kaliginchaaru!! vishayam cheppETappuDu kuuDaa “idi naa abhipraayam” sumii ani oka “kotta tag” tagilinchaDam kanipinchindi. naa laanTi vaaLLa vimarSalaki gurikaakunDaa unDaDaaniki ilaa chESaarO EmO teliyadu 😉

  2. Ii book gurinchi niiku modata cheppindi nene naa 😉

  3. The writer of Mithunam, Sriramana is good in parodies and hykoos (mini poems-unpublished). He had an excellent sense of humor. His handwriting is influenced by that of Sanjivadev’s hand writing. His letters look as if they are printed. He wrote stories and dialogues for few Telugu films. His other books
    Sri Channel, Haasyajyothi and Sriramana parodies are also worth reading.At present he is editor of Navya,Telugu weekly.

  4. Mithunam’s translation in kannaDa (by Vasudhendra) is perhaps more popular than the original collection…

    If only i could see his handwriting.. How i wish…

    SreeRamana’s parodys, i must say are Phenomenal(With a big P)… Hail! Hail!!!


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: