మొన్నొకరోజు పుస్తకం.నెట్ పని చేయట్లేదనీ, కొన్నాళ్ళలో తిరిగొస్తామనీ చెప్పి రాసానా….అలా రాసానో లేదో..ఇలా వచ్చేశాం!
అవునండీ, మళ్ళీ వచ్చేశాం!! (గతం తెలీని వారి కోసం నవంబర్లో సైట్ ఒకసారి డౌన్ అయినప్పుడు రాసిన టపా ఇదిగో)
* ఓపిగ్గా ఎదురుచూసిన వారికీ
* ఏమైందని ఈమెయిల్స్ చేసిన వారికీ
* సైటుని మళ్ళీ నిలబెట్టిన వారికీ (అంటే నాకేం సంబంధం లేదు. మా రాక్-స్టార్స్ – అనగా పూర్ణిమా, పొద్దు బృందం కలిసి నిలబెట్టేశారు).
* వ్యాసాలు పంపేశాక సైట్ డౌన్ అవడంతో ఎదురుచూస్తున్న వ్యాసకర్తలకూ
* అతి బలీయమైన విధికీ!
కొంతమందికి వెంటనే సైటు తెరుచుకోకపోవచ్చు. బ్రౌజర్ కాషింగ్ వల్ల కావొచ్చు, మరేదన్నా కారణం ఉండొచ్చు. కానీ, రిఫ్రెష్ చేసి చూడండి ఓసారి. ఎడిటర్@ అన్న ఈమెయిల్ తాత్కాలికంగా పని చేయడంలేదు. కనుక, ఏ ఈమెయిల్కి మెయిల్ చేయొచ్చు? అనేది సైటులోకి వెళ్ళి చూడండి
తక్కిన వారి సంగతి ఏమైనా, నేను మాత్రం పుస్తకం.నెట్ని చాలా మిస్సయ్యాను.
కానీ, పునరపి జననం, పునరపి మరణం – అంటే ఇదే కాబోలు అనిపించింది ఇవ్వాళ!!