పరాశక్తి (శివాజీ గణేశన్ తొలి చిత్రం)

చాలారోజుల, నెలల బట్టి “పరాశక్తి” చూడాలనుకుంటూ, “మనకెక్కడ ఇందులోని ప్రాపగాండా అంతా భరించే ఓపిక?” అనుకుని వాయిదా వేస్తూ వచ్చాను. పోయిన వారం ఫేస్బుక్ లో కప్పాలోట్టియ తమిళన్ ప్రస్తావన రావడంతో, ఒక స్నేహితునితో సంభాషణలో “పరాశక్తి” ప్రస్తావన వచ్చింది. సరే, శివాజి సినిమా ఏదన్నా చూసి కొన్ని రోజులైంది కదా (అంతకు మూడ్రోజుల ముందే తిరువిళయాడళ్ లోని కొన్ని దృశ్యాలు చూసిన విషయం లెక్కలోకి తీసుకోకూడదు) అని, ఇంటికి వెళ్ళగానే “పరాశక్తి” చూశాను. మూడు గంటల సినిమా. దాదాపు ఎనభై శాతం సినిమా దాకా నేను “అబ్బ! ఏమి సినిమా! ఏమి నటన!” అన్న వావ్! ఫీలింగ్లోనే ఉన్నాను. శివాజి అద్భుతమైన నటన, కరుణానిధి పవర్ఫుల్ డైలాగులు (నాకు వందశాతం అర్థం కాలేదు కానీ, అర్థమైనంతలో చెబుతున్నా), అనవసరమే ఐనా బాగున్న పాటలు, కథలోని విషాదం – అన్నీ అలా నన్ను కట్టిపడేశాయి.

కథ క్లుప్తంగా చెప్పాలంటే: ముగ్గురు సోదరలు రంగూన్ లో జీవిస్తూంటారు. తమిళనాట జరగబోయే తమ చెల్లెలి పెళ్ళికి చాలా ఏళ్ళ తరువాత ఇండియా వెళ్దాము అనుకుంటూ‌ ఉంటారు. అది రెండో‌ ప్రపంచ యుద్ధం జరిగే సమయం. వీళ్ళందరికీ కలిసి వెళ్ళడానికి షిప్ లో స్థలం ఉండదు. దానితో గుణశేఖరన్ అన్న పేరుగల మూడో వాడిని పంపుతారు, మిగితా వాళ్ళు తరువాత వద్దాం అని. అతను మన శివాజీ. ఈ నౌక మధ్యలో అనేక ఇబ్బందులు పడి లాస్టుకి చాలా రోజుల తరువాత దేశంలోకి వస్తుంది. ఇతను వాళ్ళూరు వెళ్ళే ముందు ఒకరోజుకని ఒక హోటెల్లో ఆగుతాడు. ఇంతలోపు ఇతన్ని మోసం చేసి డబ్బులు కాజేస్తారు ఒక ముఠా వాళ్ళు. చేతిలో‌ డబ్బు లేదు. ఆకలి. ఎలా నెట్టుకురావాలో తెలీదు. ఈ పరిస్థితుల్లో అతను నగరంలో పిచ్చివాడి వేషం వేసి తిరుగుతూ పొట్టపోసుకుంటూ ఉంటాడు. ఇలాగే ఒకరోజు చివరికి వాళ్ళ చెల్లెలి అడ్రస్ కనుక్కుని అక్కడికి చేరుకుంటాడు. అక్కడ ట్విస్ట్ ఏమిటంటే – చెల్లి పెళ్ళయ్యాక, ఒక బాబుకి జన్మనిస్తుంది. ఆ టైములోనే ఆక్సిడెంటులో ఆమె భర్త, ఆ షాక్లో ఆమె తండ్రీ మరణిస్తారు. ఆస్థి మొత్తం వేలం వేస్తారు. ఆమె ఇడ్లీ కొట్టు పెట్టుకుని బ్రతుకుతూంటుంది. మరి తన ప్రసుత్త పరిస్థితిలో చెల్లి కళ్ళబడ్డం ఇష్టంలేక అతను తానెవరో చెప్పకుండానే ఆమెకి సాయం చేస్తూంటాడు. ఇంతలోపు మనకి మిగితా ఇద్దరు సోదరులూ ఎమయ్యారో తెలుస్తుంది. ఎవళ్ళకి వాళ్ళకి తక్కిన సోదరులు, సోదరి ఏమయ్యారో తెలియదు అనమాట. ఇదిలా ఉండగా, గుణశేఖరన్ కి ఒక హీరోయిన్ ఎంట్రీ‌ (పండరీబాయి). ఒకానొక సందర్భంలో ఆకలి బాధకి తాళలేక తన పిల్లవాడిని నదిలో పడేస్తుంది చెల్లి. దానితో భ్రూణహత్య నేరమని ఆమెని, సైడ్ ట్రాక్లో ఫలానా ఒకతన్ని కొట్టాడని గుణశేఖరుడినీ కోర్టులో ప్రవేశపెడతారు. జడ్జి – పెద్దన్న! రెండో అన్న కూడా వస్తాడు సీన్ లోకి. క్లైమాక్స్ దృశ్యం లో అందరూ కలుసుకుంటారన్నమాట. (మీకు బాగా వివరంగా కథ కావాలంటే – వికీ పేజీ చూడండి, లేదా సినిమా చూడండి).

సినిమా లో చాలా‌ రాజకీయ ప్రాపగండా ఉంది కానీ, మామూలుగా సినిమాలాగ తీశారు – డాక్యుమెంటరీలాగ కాకుండా. కనుక, కావల్సినంత నాటకీయత, నవరసాలూ – ఉన్నాయి. ముఖ్యంగా శివాజీని చూడ్డానికి రెండు కళ్ళూ చాలవనే చెప్పాలి :-). ఇది తొలి సినిమానా ఇతనికి? నిండా పాతికేళ్ళైనా లేని నటుడు – ఇంత అనుభవం కలవాడిలా ఆ పాత్రలోకి ఒదిగిపోయాడా? అని ఆశ్చర్యపోయాను నేను. నిజమే, అతనికి రంగస్థల అనుభవం ఉంది. అయినా, తొలి సినిమా తొలి సినిమానే. సినిమా క్లైమాక్స్ దృశ్యంలో కోర్టులో వాదించే సీన్ ఉంది – అందరూ దాని గురించి ప్రముఖంగా చెబుతారు. కానీ, సినిమా మొత్తంలో అతను కనబడ్డ ఏ దృశ్యమైనా అదే స్థాయిలో ఉందని నా అభిప్రాయం. ఉన్న దానికి తోడు ఆ కథలోని ట్విస్టుల వల్ల, నాలాంటి hyper imaginative మనుషులు పూర్తిగా లీనమైపోయి, నవరసాలూ అనుభవిస్తారు అనమాట!‌:-)

కొన్నున్నాయి – నాకు నచ్చనివి:
౧. సినిమాలో ఆ ట్విస్టులు అవీ అటుపెడితే, పండరీబాయి పాత్ర ఎంట్రీ, హీరో-హీరోయింల మధ్య ప్రేమా, స్నేహం – ఇవన్నీ మరీ సడెన్ గా జరిగిపోయినట్లు, నాటకీయంగా, కృతకంగా అనిపించాయి నాకైతే.
౨. ఆ చివ్వరి అరగంటా ఎంత నాటకీయంగా ఉంటుందంటే…అంత నాటకీయంగా ఉంటుంది. నటీనటుల (ముఖ్యంగా గణేశన్) వ్యక్తిగత ప్రతిభావిశేషాలు కూడా ఆ భాగం “బోరు కొడుతుంది” అనకుండా ఆపలేకపోతున్నాయి నన్ను అంటే అర్థం చేసుకోవాలి మరి.
౩. మాట్లాడితే పాట. పాటలు బాగున్నాయి కానీ, అన్ని అక్కర్లేదేమో.

ఇంకెక్కువ రాయదల్చుకోలేదు కానీ – నాకైతే సినిమా మొత్తానికి నచ్చింది. ఆ చివరి అరగంటా కొంచెం విసుగు పుట్టించింది కానీ, దాని కారణంగా మొత్తం సినిమాని తీసిపారేయలేను. డైలాగుల కోసం, శివాజీ కోసం చూడవచ్చు.

Published in: on March 17, 2014 at 7:00 am  Comments (1)  
Tags: ,

The Stronger – August Strindberg

Persona” was the first Ingmar Bergman movie I watched, in mid-2008 or so. Since then, I watched a couple of his movies, read some of his writings, reached Strindberg from him in the past few years. However, “Persona” remained the most intriguing movie, although its not my favorite Bergman movie. Although I don’t think I understand the movie, it was the one that raised my curiosity about Bergman as a writer and set me on the path of watching his other movies. While listening to the lectures on Bergman in Scandinavian Film and Television course on coursera, I learnt that Strindberg’s one-act play, “The Stronger” was an inspiration for “Persona”.

[The word "inspiration" is very different from "copy". Both the play and the movie are independent entities and are equally worth checking out. I personally would consider Persona to be a much more complex psychological drama and its much longer.]

Now, “The Stronger” did not particularly fascinate me. But it is hard to not think about the characters and about their possible interpretations, after reading the play. Its short, very short, but has its impact on the reader nevertheless. I will not say anything more, but will quote something that I read again and again in the play (No, not because I don’t understand English – but because the characters came alive in front of my eyes when I read the monologue).

“Everything, everything came from you to me, even your passions. Your soul crept into mine, like a worm into an apple, ate and ate, bored and bored, until nothing was left but the rind and a little black dust within. I wanted to get away from you, but I couldn’t; you lay like a snake and charmed me with your black eyes; I felt that when I lifted my wings they only dragged me down; I lay in the water with bound feet, and the stronger I strove to keep up the deeper I worked myself down, down, until I sank to the bottom, where you lay like a giant crab to clutch me in your claws–and there I am lying now.

I hate you, hate you, hate you! And you only sit there silent–silent and indifferent; indifferent whether it’s new moon or waning moon, Christmas or New Year’s, whether others are happy or unhappy; without power to hate or to love; as quiet as a stork by a rat hole–you couldn’t scent your prey and capture it, but you could lie in wait for it! “

Here is an interesting analysis of the play.

A few months back, I bought “Persona”‘s screenplay and found a pdf of critical essays on Persona. Perhaps, its time to start reading them soon! :-)

Published in: on February 23, 2014 at 1:16 pm  Leave a Comment  

ఈ వారాంతం Dreyer సొంతం ..

ఇటీవలి రెండు మూడేళ్ళలో – నేను ఓపిగ్గా, ఆసక్తిగా పుస్తకాలు చదవడం తగ్గిపోయింది, బహుశా పీ.హెచ్.డీ. ఒత్తిడివల్లననుకుంటాను. ఉన్న కాస్త చదువులో నన్ను కట్టిపడేసి చదివించిన రచయితలు ముగ్గురు (Bergman, Strindberg, Ibsen); ఎంతో కొంత తన సినిమాల ద్వారా నన్ను ప్రభావితం చేసిన ఒక దర్శకుడు (Bergman) – అంతా స్కాండినేవియన్ సంతతే కనుక, నాకు ఆ దేశాల సాహిత్యం, సినిమా ప్రపంచాల మీద కుతూహలం పెరిగింది. ఈ నేపథ్యంలో కోర్స్ ఎరా వెబ్సైటులో Scandinavian Film and Television అన్న కోర్సు గురించి చూసి, అందులో ఒక వారం మొత్తం Bergman గురించే ఉంటుందని గమనించేసరికి – ప్రస్తుత పని వొత్తిడిలో కొనసాగడం కష్టమని తెలిసీ పుటుక్కుమని చేరిపోయాను.

రెండువారాలైనాయి, చక్కటి కోర్సు. రెండో‌ వారం లో తొలినాటి స్కాండినేవియన్ చిత్రపరిశ్రమ గురించి పరిచయం చేస్తూ, డేనిష్ దర్శకుడు Carl Theodor Dreyer గురించి, అతని సినిమాల గురించీ చాలా ప్రస్తావించారు. ఆ లెకర్ల నోట్సు లో భాగంగానే ఆయన తీసిన కొన్ని సినిమాల వికీ లంకెలు కూడా ఇచ్చారు. శుక్రవారం రాత్రి దాకా ఒక పేపర్ సబ్మిషన్ తాలూకా శ్రమదానం చేశాక, వారాంతం ఇంక తాపీగా‌ కాలక్షేపం చేద్దాం అనుకుంటూ – ఒక సినిమా మొదలుపెట్టాను. ఆ తరువాత మరొకటి – చివర్న మరొకటి – అలా సాగింది నా వారాంతం. అలా, డ్రెయర్ నా వారాంతాన్ని సొంతం చేసుకున్నాడు. ఈ మూడు సినిమాల గురించి సంక్షిప్తంగా పరిచయం చేయాలనుకుని రాస్తున్న టపా ఇది – మొదటిది, చివరిది మూకీ చిత్రాలు. మధ్యలోది టాకీ.

The President (1919):
ఈ సినిమా కథ 19వ శతాబ్దంలో నడుస్తుంది. ఆస్ట్రియన్ రచయిత Karl Emil Franzos రాసిన Der President అన్న నవల ఆధారంగా తీశారు. ఈ సినిమా కథ గురించి, నేపథ్యం గురించి తెలుసుకోవాలనుకుంటే, Carl Th.Dreyer వెబ్సైటులోని పేజీ చూడండి.

సినిమా పేరుకి మూకీ కానీ, inter-titles మరీ ఎక్కువగా ఉన్నట్లు తోచి – దాదాపు టాకీలాగనే అనిపించింది నాకైతే. అందునా విడియో నాణ్యత అంత గొప్పగా లేనందువల్ల కొన్ని చోట్ల వాటిలో ఏం రాయబడ్డాయో సరిగా కనబడలేదు కూడానూ. అయితే, ఈ విషయాలు పక్కన పెడితే సినిమా బోరు కొట్టించకుండా సాగింది. అలాగే, ఇదివరలో సత్యజిత్ రాయ్ వ్యాసాల్లో అనుకుంటాను, చదివాను-సినిమాల్లోకి శబ్దం వచ్చాక జాతీయముద్ర అంటూ ఒకటి ఏర్పడ్డం మొదలైందని. నిశబ్ద చిత్రాల జాతీయముద్రని ఈ చిత్రంలో చూసి తెలుసుకున్నాను :-). ముఖ్యంగా ఒక పెళ్ళి దృశ్యం – మామూలుగా సినిమాల్లో చూసే చర్చి పెళ్ళిళ్ళకంటే‌ భిన్నంగా అనిపించింది. బహుశా డెన్మార్కులో ఇలా జరిగేవేమో అనుకున్నాను. ఇప్పటి పద్ధతులకి సినిమా కొంచెం నెమ్మదిగా సాగినట్లే లెక్క. అలాగే, నాకైతే కథ కొంచెం సాధారణంగా అనిపించింది కానీ – ఆ‌కాలానికి అలా ఫ్లాష్ బ్యాకులు వాడ్డం, మానసిక సంఘర్షణలను చూపడం ఇవన్నీ Dreyer కి ముందు పెద్దగా‌ లేవట. పైగా ఇది అతని తొలి చిత్రం!

ఈ సినిమా కి సంబంధించిన స్క్రిప్ట్ మాతృక (డేనిష్ భాషలో), ఇతరత్రా ఆసక్తికరమైన వివరాలు – అన్నీ డేనిష్ ఫిల్మ్ ఇంస్టిట్యూట్ వారు డ్రెయర్ పేరిట నెలకొల్పిన వెబ్సైటులో ఈ సినిమాకి సంబంధించిన పేజీలో చూడవచ్చు. (అన్నట్లీ విధమైన comprehensive webpages మన సినిమాలకి ఏ‌ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ అయినా నిర్వహిస్తోందా?)

Ordet (The Word) – 1955
ఈ మూడు చిత్రాల్లో నన్ను అమితంగా ఆకట్టుకున్న చిత్రం ఇది. క్రైస్తవ మతం, విశ్వాసాల నేపథ్యంలో సాగుతుంది కథ. మొదటి దృశ్యం నుండే కట్టిపడేసింది నన్ను. కథ, కథనం, నటీనటులు, వాతావరణం – అన్నీ సహజంగా అనిపించడం ఒక కారణమైతే, బాగా ప్రభావవంతమైన సంభాషణలు ఉండడం మరొక కారణం. ఈ సినిమాని Dreyer తీసిన గొప్ప సినిమాల్లో ఒకటిగా భావిస్తారు. ఈ సినిమాని గురించి, ఇది నాపైన చూపిన ప్రభావం గురించి, విడిగా రాద్దాం‌ అనుకుంటున్నాను. కనుక, ప్రస్తుతానికి ఇక్కడ ఆపుతాను. రెండు గంటల సినిమా – యూట్యూబులో ఆంగ్ల ఉపశీర్షికలతో లభ్యమవుతోంది. మంచి సినిమా మీద ఆసక్తిగలవారు తప్పకుండా చూడాల్సిన చిత్రం. నేను ఇప్పటివరకూ చూసిన “గొప్ప” సినిమాల జాబితాలో దీన్నీ చేర్చుకున్నాను (గొప్పంటే నాకు గొప్ప అనిపించినవి మాత్రమే సుమా!). ఈసినిమా గురించిన వివరాలు, సంబంధిత విమర్శక వ్యాసాలు ఇలాంటివన్నీ డ్రెయర్ జాలగూటిలో చూడవచ్చు.

The Passion of Joan of Arc (1928):
ఈ సినిమా ఫ్రెంచి దేశపు వీరనారి Joan of Arc గురించి. మొత్తం జీవితం గురించి కాదు కానీ, The Trial of Joan of Arc అని పేరు పొందిన సంఘటన గురించి. ఈ సినిమా చూసే ముందు నన్ను అమితంగా ఆకట్టుకున్నది ప్రస్తుతం మనం చూడగలుగుతున్న వర్షన్ సినిమా తీసిన ఎన్నో ఏళ్ళ తరువాత అనుకోకుండా ఒక mental asylum లో కనుగొనబడిన వైనం. సినిమా చూట్టం మొదలుపెట్టాక ఆశ్చర్యపరచిన ఒక అంశం – ఇది నిఖార్సైన నిశబ్ద చిత్రం (అంటే‌ నేపథ్య సంగీతం కూడా లేదు!!). 1928లో రిలీజైన చిత్రంలో నేపథ్య‌ సంగీతం ఉంది కానీ, ఇప్పుడెందుకు లేదు?అంటే- అసలు ఆ‌సినిమా వెనుక, తరువాతి కథే ఓ పెద్ద సినిమా కథలా ఉంది!! వివరాలకి సినిమా గురించిన వికీపేజీ చూడండి.

సరే, నేపథ్య సంగీతం కూడా లేకుండా, pindrop silence లో ఈ సినిమాని గంటన్నరపాటు చూడగలనా? అనిపించినా – ఏకధాటిగా కాకపోయినా విరామాల మధ్య చూడగలిగాను- సౌండు లేకుండానే ఈ సినిమా అంత strong గా ఉందంటే … ఇంక డైలాగులు, సంగీతం అవీ కూడా జతచేస్తే ఎంత గొప్పగా ఉండేదో అనిపించింది. Intertitles లేకపోతే ఏం‌జరుగుతోందో తెలిసేది కాదన్నమాట పక్కన పెడితే, నటీనటులని మరీ క్లోజప్స్ లో చూపినందువల్లో ఏమో కానీ – విలనుల మీద అసహ్యంతో కూడిన భయమూ, Joan of Arc మీద ఒక పక్క జాలీ, మరో పక్క హీరోయిన్ వర్షిప్ భావనా కలిగాయి. ఆ నటి Renée Jeanne Falconetti సినిమా మొత్తం ఏడుస్తూనే ఉంటుంది కానీ, కొన్ని దృశ్యాల్లో ఆమె నటన చూస్తే నోటమాట రాలేదు. కొంచెం ఓపిక చేసుకుని చూడాల్సిన సినిమా. నేను కొన్ని గంటల సమయం తీసుకుని బ్రేకులు తీసుకుంటూ చూశాను – అంత క్లోజప్లో ఆ భయంకర నిశబ్దాన్ని అంగీకరించలేక!). కానీ, ఆ‌ ఓపిక్కి తగ్గ reward ఉంటుంది సినిమా చూసే అనుభవంలో!‌ :-) ఈసినిమా గురించి డ్రెయర్ వెబ్సైటు పేజీ ఇక్కడ. అన్నట్లు చెప్పడం మరిచా – హీరోయిన్ ని చూస్తే కాజోల్ గుర్తువచ్చింది నాకు ;) ఎందుకనడక్కూడదు.

మొత్తానికి ఒక్కటి మాత్రం అనిపించింది – చెప్పడమేమో శబ్ద చిత్రాలొచ్చాక డ్రెయర్ ఎక్కువ సినిమాలు తీయలేదు అన్నారు కానీ, అసలుకీయన చిత్రాలన్నీ శబ్దంతోనే బాగుంటాయేమో అని. నాకు అర్థమైనంతలో ఆర్థిక కారణాల వల్ల ఈయన దాదాపు దశాబ్దం పాటు సినిమాలేవీ తీయలేదు. శబ్దం వచ్చాక ఎక్కువ సినిమాలు తీసుంటే ఇంకొన్ని గొప్పసినిమాలు వచ్చేవేమో అనిపించింది.

The President ని వదిలేస్తే, ఈ‌తక్కిన రెండు సినిమాలను మళ్ళీ చూడాలనుంది. Ordet తప్పకుండా చూస్తాను కానీ, ఓపిగ్గా ఈ Passion of Joan of Arc మళ్ళీ ఎపుడైనా చూడగలనా? అన్నది మాత్రం అనుమానమే!! :-)

ఈ సినిమాలు వెదుకుతున్న క్రమంలో The parson’s widow, Vampyr, Day of wrath – వంటి ఆసక్తికరమైన సినిమాల గురించి తెలిసింది. ఎప్పుడో‌ ఇవీ చూడాలి, Dreyer అంతగా కుతూహలం కలిగించాడు మరి నాకు అతని సినిమాలపై!

Published in: on February 18, 2014 at 9:14 am  Leave a Comment  
Tags:

పా

(హెచ్చరిక: ఆ టైటిల్ కీ, ఈ‌టపాకీ సంబంధం లేనట్లు ఎవరికైనా అనిపిస్తే అది మీ తప్పు కాదు.)
***
ఆ మధ్యన హీరో నరేష్ (పాత హీరో, అల్లరి నరేష్ కాదు) తో ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే ప్రోగ్రాము చూసి దాని గురించి మాట్లాడుకుంటూండగా, “కనకమహాలక్ష్మి రికార్డింగ్ డాన్స్ ట్రూప్” సినిమా‌ ప్రస్తావన వచ్చింది. సరే, శుక్కురారం సాయంకాలం కదా అని ఆ సినిమా చూద్దామని అనుకున్నా నిన్న. మొదలుపెట్టిన కాసేపటికి ఆ హీరోయిను హీరో గురించి తల్చుకున్న ప్రతిసారీ వచ్చే నేపథ్య సంగీతం హిందీ సినిమా “పా” లోని “హల్కె సే బోలే” పాటది కదా! అనుకుంటూ, అలా అది మూడో సారి వినబడే టైముకి నేనా సినిమా పాజ్ చేసి, హల్కె సే బోలే వినడం మొదలుపెట్టాను.

సరే, అది మొదలుపెట్టగానే, ఆ సినిమాలోని నా ఫేవరెట్ పాట – “Mudi mudi ..” గుర్తుకొచ్చింది. ఆ పాట ప్లే చేసిన ప్రతిసారీ షరామామూలుగా రీప్లే చేస్తాను కనుక అలా ఓ పదిసార్లు విన్నాక, సరే, మిగితా పాటలు కూడా విందాంలే అనుకుని, మొదలుపెట్టా గానా.కాం అన్న వెబ్సైటు ద్వారా. మొత్తానికి కాసేపటికి, ఇలాక్కాదు కానీ సినిమా చూద్దాం‌ అనుకున్నా.

ఆ సినిమా రిలీజయ్యే నాటికి నేను “దీనెమ్మ జీవితం” ఫేజులో నెట్టుకొస్తున్నా కనుక థియేటర్ కి వెళ్లలేదు. తర్వాతెప్పుడో ఇంట్లో‌ ఓ‌ డీవీడీలో చూట్టమూ – ఏం‌ చేశాడూ అమితాబూ! ఏం చేసిందీ విద్యాబాలన్! అనుకోడమూ జరిగింది. మళ్ళీ నిన్న రాత్రే చూడ్డం. అంతే కథ. సినిమా గురించేమీ లేదిక్కడ!

నాకైతే ఇప్పుడు కూడా సినిమా చాలా నచ్చింది. బాగా తీశారు. అన్నింటికంటే ముఖ్యంగా – అమితాబ్, విద్యాబాలన్ అద్భుతంగా చేశారు. వీళ్ళ మీద గౌరవం లాంటిది ఒకటి కలిగింది – What actors! అని. ముఖ్యంగా అమితాబ్ – ఆ వయసులో కూడా, పన్నెండేళ్ళ ఆరోగా నటించి మెప్పించారు. నాకైతే వీళ్ళ కోసమే ఆ సినిమా మళ్ళీ మళ్ళీ చూడాలనుంది. అలాగే, రీసైకిల్ చేసుకున్నా, ఏం‌చేసుకున్నా, ఇళయరాజా ఇళయరాజానే. ఆయన పాటలు ఆయన పాటలే.

అంతే, ఫేసుబుక్ లోనో ఎక్కడో రాయాల్సిన వ్యాఖ్యని బ్లాగులో పోస్టు చేసుకుంటున్నాను.

Published in: on February 8, 2014 at 6:44 pm  Comments (4)  

ఒక డాక్టర్ గారి మరణం

(ఇది ఎప్పుడో‌ రెండు రెండున్నర నెలల క్రితం రాసి పోస్టు చేయని టపా. ఇపుడు పోస్టు చేయాలనిపించిందన్నమాట.)

********
Cinemas of India వెబ్సైటు గురించి తెలిశాక, గత నెలా-రెణ్ణెళ్ళ కాలంలో ఒక నాలుగైదు సినిమాలు చూసి ఉంటాను అందులో. దాదాపుగా చూసినవన్నీ నచ్చాయి. ఆట్టే నచ్చనివి కూడా రొట్ట కొట్టుడు సినిమాల మీద కొన్ని రెట్లు నయంగా తోచాయి. ఈమధ్య మళ్ళీ తొంగి చూసి, యధాలాపంగా “Ek Doctor ki Maut” అన్న చిత్రం చూడ్డం మొదలుపెట్టాను. అంతే – ఆ సినిమా గురించి ఆ తరువాత రాత్రై పడుకునేదాక – ఎవళ్ళు ఆంలైన్ కనిపిస్తే వాళ్ళకి, ఎవళ్ళతో ఫోన్ లో మాట్లాడితే వాళ్ళకి చెప్పాను :-) ఏ కాస్తైనా సినిమా పైన ఆసక్తి ఉన్న వారు, సైన్సు విద్యార్థులైతే మరీ తప్పనిసరిగా చూడాల్సిన సినిమా. ఇంతలా ఫీలైపోతున్నా కనుకే, ఇన్నాళ్ళ తరువాత మళ్ళీ‌ బ్లాగు టపా రాస్తున్నా.

కథను వివరించే ముందు ఒక నేపథ్యం చెప్పాలి. Subhash Mukhopadhyay అని ఒక డాక్టర్ గారు ఉండేవారు ఒకప్పుడు. భారతదేశంలో In-vitro fertilization (IVF) పద్ధతి ద్వారా పుట్టిన మొదటి బిడ్డ ఈయన చలవే. ప్రపంచంలో మొదటి IVF-baby కి, ఈ పాపకి రెండు నెలలే తేడా వయసులో. అంటే, దాదాపుగా, IVF-పితామహుడు అనదగ్గ వ్యక్తి. మరి ఇంతకీ, ఆయనకి దాని వల్ల ఒరిగినది ఏమిటి? ప్రభుత్వం నుండి harassment, తోటి పరిశోధకుల నుండి అనుమానాలు, అవమానాలు. ఈయన ఒకపక్క ఇక్కడ జనాలని కన్విన్స్ చేసేలోపు అక్కడ బయట దేశంలో ఇదే పరిశోధన చేసిన ఇంకోళ్ళకి పేరు వచ్చింది. తర్వాత చాలా కాలానికి 2010లో నోబెల్ బహుమతి కూడా వచ్చింది (అప్పుడే ఈయన గురించి మొదటిసారి విన్నాను నేను). మరి సుభాష్ గారో? – ఈ వేధింపులు అవీ భరించలేక ఆయన ఆత్మహత్య చేసుకున్నారు 1981లో!

ఇదంతా ఎందుకు చెబుతున్నాను అంటే – ఈ సినిమా ఆయన జీవితం ఆధారంగా తీశారు. ఆయన జీవిత కథ కాదు. ఆయన జీవితం ఆధారంగా రాసిన కథని సినిమాగా తీశారు. ఎవరు? తపన్ సిన్హా.

కథ: డాక్టర్ దీపాంకర్ రాయ్ (పంకజ్ కపూర్) ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తూనే, ఇంట్లో సొంత పరిశోధనాశాల పెట్టుకుని కుష్టురోగం గురించి పరిశోధనలు చేస్తూ ఉంటాడు. పదేళ్ళు అలా చేశాక, మొత్తానికి కుష్టురోగానికి vaccine కనిపెడతాడు. దీనికీ, స్త్రీలలో infertility కి కూడా ఏదో సంబంధం ఉందనీ, కానీ, అది నిశ్చయంగా తెలియడానికి ఇంకా సమయం పడుతుంది అనుకుంటాడు. అతని స్నేహితుడైన యువ జర్నలిస్టు (ఇర్ఫాన్ ఖాన్ ఎంత చిన్నగా ఉన్నాడో!!) అత్యుత్సాహంతో దాని గురించి పత్రికలో రాస్తాడు. ఇక టీవీల్లో ప్రచారం ఇవన్నీ చూసి అసలు సంగతి వదిలేసి – గైనకాలజిస్టులు కొందరు – “నువ్వు మా ఏరియాలోకి ఎందుకు దూరుతున్నావు? నీకేం తెలుసు?” అని దాడికి దిగుతారు. ఇదీ, ప్రొఫెషనల్ జెలసీ, దీపాంకర్ short temper వల్ల కలిగిన శతృత్వాలు – వెరసి అతన్ని తన పరిశోధనలూ చేయనివ్వక, ఇప్పటిదాకా చేసిన వాటి గురించి పేపర్స్ సిద్ధం చేయనివ్వక, సతాయిస్తారు. అతని భార్య (షబానా అజ్మీ), ఒకళ్ళిద్దరు స్నేహితులూ తప్ప ఎవ్వరూ అతనికి చేయూతనందించరు. ఇక, ఈ తతంగంలో మొత్తానికి ఏమైంది? దీపాంకర్ భవిష్యత్తు ఏమైంది? అన్నది కథ.

నటీనటులందరూ అద్భుతంగా ఉన్నా కూడా, షబానా నాకు అందరిలోకి విపరీతంగా నచ్చింది. ఒకపక్కన తనని పట్టించుకోకుండా రోజస్తమానం పరిశోధనలంటూ ఇంటి నిండా ఎలకల్నీ వాటిని పెట్టుకుని అర్థరాత్రుళ్ళూ‌ అపరాత్రుళ్ళూ పని చేసుకుంటూ‌ ఉంటే విపరీతమైన ఫ్రస్ట్రేషన్ కి గురైయేదీ ఆమే. అదే మనిషి, అందరూ వేధిస్తున్న సమయంలో తన భర్తకి ఎంత సపోర్టుగా నిలబడుతుందో – షబానా ఆ పాత్రలో ఒదిగిపోయింది. అసలు సినిమాలో నాకు బాగా నచ్చిన అంశాల్లో – ఈ భార్యా భర్తల మధ్య ఉన్న బాంధవ్యాన్ని చిత్రీకరించిన విధానం, అక్కడ నటీనటులిద్దరూ చూపిన intensity – ముఖ్యమైనవి.

సినిమాలో నాకు నచ్చిన కొన్ని దృశ్యాలు, ఆసక్తికరమైన చర్చలు:

ఒక దృశ్యంలో… ఆవిడ వంట చేస్తూంటుంది. ఆయన ఏదో‌ పరిశోధన చేస్తూంటాడు. ఉన్నట్లుండి వచ్చి, స్టవ్ మీద ఉన్నది తీసేసి, దాన్ని తీసుకుని, తన వద్ద టెస్ట్ ట్యూబ్ లో ఉన్న ద్రవాన్ని వేడి చేయడానికి పట్టుకెళ్ళి పోతాడు!!!‌:-) (చూసి తీరాలి ఆ దృశ్యం). ఆమె అవాక్కై చూస్తూండిపోతుంది. కొన్ని గంటల తర్వాత రాత్రిపూట వచ్చి ఆకలంటాడు. ఆమె – బ్రెడ్డు, అరటిపండు పెడుతుంది. ఆయన – ఇదేం తిండి? అంటే, ఆమె – నువ్వు స్టవ్ పట్టుకెళ్ళిపోతే నేను వంట ఎలా వండాలి? అంటుంది. దానికి ఆయన – ఇంకో స్టవ్ కొనుక్కొచ్చి వండలేవా? అంటాడు :)‌ :)

అమూల్య (ఇర్ఫాన్ ఖాన్) పీహెచ్డీ చదివి ఎందుకు జర్నలిజం వైపుకి మళ్ళాడో డాక్టర్ దీపాంకర్ కి వివరించే దృశ్యం లో జరిగిన చర్చ నాకు ఆసక్తికరంగా అనిపించింది. సరిగ్గా ఇలాంటి ఆలోచనలే ఉన్న స్నేహితులు ఉన్నందువల్ల కాబోలు, మనసుకి దగ్గరగా వచ్చింది.

డాక్టర్ దీపాంకర్ గురువు డాక్టర్ కుందు ఈ‌సినిమాలో అందరికంటే ప్రాక్టికల మనిషి అనిపించాడు నాకు. దీపాంకర్ రిజల్ట్స్ ను తొందరగా పబ్లిష్ చేయడం మీద దృష్టి పెట్టమనీ, పత్రికల వాళ్ళతోనూ, సభలూ సమావేశాలకి వెళ్ళడం లోనూ సమయం వృథా చేయొద్దనీ పలుసార్లు వారిస్తాడు ఆయన తన శిష్యుడిని. నిజంగా ఆ పరిస్థితుల్లో skeptics నోరు మూయించడానికి బహుశా డాక్టర్ కుందు అన్నట్లు ముందు ఆ పేపర్లేవో రాసి అంతర్జాతీయ ఆమోదం పొంది..(రచ్చ గెలిస్తే ఇంట గెలవడం తేలికవుతుంది కొన్నిసార్లు!!) ఆ పైన పత్రికలూ, అసూయాపరులైన తోటివారూ-ఇవన్నీ చూసుకోవాల్సింది అనిపించింది.

దీపాంకర్ మీద వేసిన ఎంక్వైరీ ప్యానెల్ చర్చలు – సుభాష్ ముఖోపాధ్యాయ నిజజీవితంలో జరిగిన సంఘటన గురించి (వికీలో చదివాను) గుర్తుతెచ్చి, మనసు వికలమైపోయింది కొన్ని క్షణాలు. సినిమాలో నిజజీవితంలో సుభాష్ లాగ కథానాయకుడు ఆత్మహత్య చేసుకోడు కానీ, దాదాపుగా disillusionment లో అతనిలోని పరిశోధకుడు ఆత్మహత్య చేసుకున్నంత పని అవుతుంది. ఆయన ఈ దేశంలో తనకి లభించిన “గౌరవాన్ని” తట్టుకోలేని పరిస్థితుల్లో, విదేశీ ల్యాబ్ వారొకరు తమతో కలిసి పనిచేయమని పంపిన ఆహ్వానాన్ని అంగీకరించడంతో ముగుస్తుంది సినిమా. ముగింపు మరీ యదార్థమంత దారుణంగా లేకపోయినా, నిజానికి ఇదీ దారుణమే.

“అందరూ అలా వెళ్ళిపోతే ఎలా?” అని కొన్ని దృశ్యాల క్రితం అతని భార్య వేసిన ప్రశ్న మనల్ని వెంటాడక మానదు.

ఇంకా రాసుకుంటూ‌ పోవచ్చు కానీ, నా దృష్టిలో ఇది ఏదన్నా కొంచెం sensible cinema చూడాలి అనుకునేవారు తప్పకుండా చూడాల్సిన సినిమా. అనేక ప్రశ్నలు రేకెత్తించింది నాలో – ఇంకా సమాధానాలు దొరకలేదు. రెండు నెలల తరువాత ఇప్పటికీ ఈ సినిమాలోని దృశ్యాలు ఉటంకించుకుంటూ చర్చలు జరుగుతూనే ఉన్నాయి నాకు – ఫోనులలో, చాట్లలో.

సినిమా చూడాలనుకునేవారు ఇక్కడ చూడవచ్చు.

ఈ సినిమా చూడగానే నాకు సత్యజిత్ రాయ్ తీసిన గణశత్రు సినిమా గుర్తువచ్చింది. అందులోనూ ఒక సైంటిస్ట్ జనబాహుళ్యంలో ప్రచారంలో ఉన్న ఒక అంశానికి వ్యతిరేకంగా శాస్త్రీయ ఆధారాలతో పోరాడాలనుకుంటే ఏమైంది? ఎలా నెగ్గుకొచ్చాడు? చివరికేమైంది? అన్నదే కథాంశం. ఈ రెండు సినిమాలూ పరస్పరం సంబంధం లేనివే అయినా, రెంటికీ మూల కథలు వేరైనా, కొన్ని విధాలుగా చాలా సంబంధం ఉంది. గణశత్రు కి మూలం నార్వేకి చెందిన ప్రముఖ నాటక రచయిత Henrik Ibsen రాసిన “Enemy of the people” నాటకం. అది కూడా అంతర్జాలంలో ఉచితంగా చదవడానికి లభ్యం.

Published in: on January 26, 2014 at 10:30 am  Comments (3)  

The “Ikiru” revist post

A few weeks back, Nagini Kandala posted on pustakam.net about Leo Tolstoy’s “The Death of Ivan Ilyich”. I felt the story looked so similar to Akira Kurosawa’s 1952 film “Ikiru” and came to know that the movie was actually motivated by the film. Now, I still did not read Tolstoy’s novel but my thoughts focused on Ikiru.

Thanks to the wonderful Inter Library Loan scheme here, a couple of days ago, I got a criterion collection DVD of Ikiru with a bonus documentary on Kurosawa and several other perks. I first watched the movie more than five years ago (here is a small article I wrote on the movie at Navatarangam.com) and so, I wondered if it will seem any different to me now.

(FYI: I realized recently that my thoughts on what I liked about Rashomon changed significantly from my first watch.)

For now, this small post is just some random notes on the movie and its accompanying commentaries on the DVD set.

Ikiru – movie

“Over the years I have seen Ikiru every five years or so, and each time it has moved me, and made me think. And the older I get, the less Watanabe seems like a pathetic old man, and the more he seems like every one of us.”
-Roger Ebert, the famous film critic said about this movie.

When I finished watching the movie, although I did not know Ebert’s words, I felt exactly the same way… that I am finding the old man Watanabe less irritating and more closer to life.

Now, I think I can say that this is one of the best movies I watched (Okay, I did not watch most of the “must watch” movies in those 10s and 100s of movie lists yet).

To know more on Ikiru, visit its wiki page.

As much as I want to write more here, for now, I don’t want to. May be some other time.

Criterion collection – Comments
Apart from the movie itself, the first DVD contained another version of the movie with some comments from Criterion Collection folks. The commentary too ran for almost as long as the movie. I like the idea and I really enjoyed the commentary to a large extent and listened to it without skipping any part. (So I ended up watching the movie again!)

Those comments on certain details I failed to notice when I watched the movie (e.g., comments on dressing style, or the mannerisms etc.,) and the trivia shared were certainly interesting. However, there were also moments where I felt that it was an overkill. I wondered if so much of analysis and spoon feeding is really necessary. Also, despite the apparent knowledge of the commentator, and the depth of this analysis, eventually, I was left with a feeling – “After all, all this commentary is just his interpretation of the movie”.

(Disclaimer: Okay, all you film critics, film students etc- don’t blast me. I would like think freely at least after initial guidance. I don’t like these spoon feeding kind of commentaries and its just a personal preference. I won’t respond to spiteful comments).

Anyway, I would think that the idea to add a commented version is great and it needs to be used at our own discretion.

Documentary on Kurosawa’s movies:

The best part of the second DVD in this set is listening to Kurosawa speaking about his movies. When I read his autobiography, the only thing that disappointed me was the fact that he stopped the story just before the international release of “Rashomon”. Since all his movies I saw were those that came after it, I was naturally curious to read his stories on those movies. The current documentary filled that void by not only making him talk about his various movies, but also by interspersing his comments with those of people who worked with him and with video clippings of the shoots.

For aspiring film-makers, these documentaries provide interesting and useful tips. For general film viewers, these documentaries are very interesting and informative. Who does not want to have a sneak-peak into the film production life of their favourite director? This interview is the one that could be revisited again and again. I would perhaps rent this DVD again after a few months/years.

There ends the story of how a dull early-autumn weekend was made colorful, thanks to this DVD! :-)

Published in: on October 14, 2013 at 6:22 am  Leave a Comment  

రషోమాన్ పునర్వీక్షణానుభవం

“పునర్వీక్షణానుభవం” – అంటే ఏమిటి? అసలా పదం ఉందా? అది దుష్ట సమాసమా? ఇలాంటివన్నీ అడగదల్చుకునేవాళ్ళకి: నాకు తెలీదు. Experiences on Revisiting Rashomon అన్న అర్థంలో వాడుతున్నానంతే.

సీరియస్ గా సినిమాని చూట్టం అన్నది నాకు అలవాటు లేని రోజుల్లో ..బహుశా ఏ 2005 ప్రాంతంలోనో మొదటిసారి చూశాను ఈ సినిమాని. మా ఇంట్లో కంప్యూటర్ తెరపై ఈ నలుపు తెలుపు చిత్రం చూస్తూ (నాకీ సినిమాని పరిచయం చేసిన) తమ్ముడు, నేను “భలే ఉందిగా ఈ సినిమా” అనుకోవడం గుర్తు ఉంది. ఆ తరువాతి నాలుగైదు సంవత్సరాల్లో, అకిరా కురొసవా దర్శకత్వం వహించిన ఇతర చిత్రాలు ఒక పదీ పదిహేనుకు పైగా చూశాను. మరి నాకంతగా విశ్లేషణాత్మకంగా చూడ్డం తెలియదు, చూడాలన్న తపనా లేదు కానీ, చాలా మట్టుకు సినిమాలు నాకు నచ్చాయి. అతని ఆస్థాన నటుల్లో ఒకడైన తొషిరో మిఫునే ని కొన్నాళ్ళు అభిమానించి, ఆరాధించి… ప్రస్తుతం మర్చిపోయాను కూడా. ;) ఇంతలోపు, మళ్ళీ ఎందుకో “రషొమాన్” మీదకి మనసు మళ్ళింది నిన్న. గత వారం పదిరోజులుగా ఆ సినిమా గుర్తుకు వస్తూ ఉండడం కూడా ఓ కారణం ఇందుకు. మొత్తానికి సినిమా చూశాను…ఈ ఉపోద్ఘాతం, ఈ బ్లాగు టపా ఎందుకంటే, అప్పట్లో నచ్చిన అంశాలు, ఇప్పట్లో నచ్చిన అంశాలు అసలు పూర్తిగా వేరేగా ఉన్నట్లు తోచింది కనుక.

(సినిమా కథ కావాలనుకునేవారు వికీపేజీ చూడండి. సినిమా చూడాలనుకుంటే యూట్యూబులో rashomon అని వెదికితే ఆంగ్ల ఉపశీర్షికలతో దొరుకుతుంది)

అప్పట్లో ఏమి నచ్చాయి? (నాకు గుర్తున్నంతలో, ఏ వరుసా లేకుండా)
* కథ … అలాంటి కథనం నేనప్పటికీ ఎక్కడా చూడలేదు. ఒకే సంఘటనకి గల నాలుగు వర్షన్స్ తో కథ చెప్పేయడం. (తరువాత పోతురాజు/విరుమాండి చూశాక…. కొంచెం అతి-నేటివ్ గా ఉన్నా, అదింకా నచ్చింది, కమల్ సినిమా కనుక.)
* తొషిరో మిఫూనే -అవి విచిత్రమైన చేష్టలే అయినా, ఈ మనిషి నన్ను ఆకట్టుకున్నంతగా ఆ సినిమాలో మరెవ్వరూ నన్ను ఆకట్టుకోలేదు.
* సైనికుడి ఆత్మ ఒక medium ద్వారా మాట్లాడే సన్నివేశం
* కట్టెలు కొట్టేవాడు, యువ సాధువు, ఇంకో మనిషి – వీళ్ళ మధ్య జరిగే సంభాషణలు

ఇప్పుడేమి నచ్చుతున్నాయి? (ఇది మాత్రం నచ్చిన వరుసలో!)
* సైనికుడి పాత్రధారి నటన. బాబోయ్, కళ్ళతోనే ఎన్ని మాటలు మాట్లాడాడు అసలు!!
* కట్టెలు కొట్టేవాడు, యువసాధువు, ఇంకో మనిషి-వీళ్ళ మధ్య జరిగే సంభాషణలు.
* కథనం, చిత్రీకరణ, ముగింపు
* కట్టెలు కొట్టేవాడి పాత్ర – మామూలు జీవితంలాగే ఇతనిలోనూ కొన్ని రంగులున్నాయి..నలుపూ తెలుపు అన్న extremes కాకుండా!
* సైనికుడి ఆత్మ ఒక medium ద్వారా మాట్లాడే సన్నివేశం… అక్కడ medium పాత్రధారి ప్రదర్శన.
* ఏడవని సందర్భాల్లో భార్య పాత్రధారి మౌనంగా చూపే స్పందనలు.
* Toshiro Mifune (ఒకప్పటిలాగ ఇప్పుడు హీరో వర్షిప్ భావన కలుగలేదు!)

ఇప్పుడేమి నచ్చడం లేదు?
* అంతకు ముందు అనిపించలేదు కానీ, ఆ వికటాట్టహాసాలు, ఆ నిర్విరామ శోకాలు – చిరాకు తెప్పిస్తున్నాయి.
* Male chauvinism కొట్టొచ్చినట్లు కనబడుతోంది, పాత్రల చిత్రీకరణలో, డైలాగుల్లో. ఆ భార్య పాత్ర విపరీతమైన Stereotyped పాత్రలా తోస్తోంది.

ఉచిత వ్యాఖ్యానం: ఆ యువసాధువు మరీ సున్నితమనస్కుడు. అదొక్కటే కాదు…సినిమాలాగే నలుపు, తెలుపుల్లో చూస్తున్నాడు కాబోలు జీవితాన్ని అనిపించింది… క్లైమాక్సు సన్నివేశాల్లో కట్టెలు కొట్టేవాడితో సంభాషణ విన్నాక. “మరీ ఇలా ఉంటే పెపంచికంలో బతకడం కష్టమేమో మేస్టారూ!” అని చెప్పాలనిపించింది. మరి నేను బ్రతకడంలో పరమ వీర అనుభవం ఉన్న వెయ్యేళ్ళ మనిషిని కనక! :-)

ఉచిత వ్యాఖ్యానం 2: నిజం చెప్పాలంటే, ఆ కట్టెలు కొట్టేవాడు ఆ చిన్న కత్తిని తన వద్ద ఉంచుకోడంలో అంత ఘోర పాపమేమీ కనబడలేదు నాకు (అతనికి అది దొరికిన చోట ఒక శవం తప్ప ఇంకెవరూ లేరు కనుక). కానీ, ఆ ఇంకో మనిషి ఏడుస్తున్న పసిగుడ్డు దగ్గరి కిమోనో కోట్టేయడం మాత్రం అది నేననుకునేంత అసహజం కాకపోయినా, దారుణం అనిపించింది. ఇవి రెండూ ఆ నలుపు-తెలుపు సినిమాలోని నలుపు-తెలుపు మనస్తత్వం ఉన్న పాత్రలు చూసినట్లు ఒకే రంగు సంఘటనలు కావు, రెంటినీ ఒకే విధంగా చూడలేము, రెంటికీ ఒకే విశేషణం అమరదు అని నా అభిప్రాయం.

ఈ వ్యాసం చదివిన వాళ్ళెవరైనా ఈ సినిమా ఇంకా చూసి ఉండకపోతే తప్పకుండా చూడండి! కాస్త నెమ్మదిగా సాగుతుంది ఇప్పటి సినిమాలతో పోలిస్తే…కానీ, ఓపిగ్గా చూస్తే, rewarding experience.

***
తదుపరి పునర్వీక్షణం – బహుశా ఇకిరు.

Published in: on September 21, 2013 at 9:23 am  Comments (11)  
Tags: ,

Sadgati

(I found this short note in my drafts folder, written in May 2013)
******

A few days ago, I ended up watching “Sadgati“. It is a 1981 Hindi film by Satyajit Ray. I wonder if such a short-duration film should actually be called a short-film but that is not the point. Sadgati is based on a story by Munshi Premchand and is a (rather silent) commentary on caste system. I say silent – because this is more of a depiction/narration than a real commentary. No one tries to take stances. No one tries to preach us. Yet, the intended message reaches us through the impact the narrative creates.

What I liked also was the fact that the movie ran for less than an hour. Although I think it could have been even shorter (with zero knowledge of movie making), I think this is an ideal time frame to make a movie out of a short-story and create a strong impact. My favourite Telugu directors would have made it more spicy with songs, fights and with 2.5 hour duration but that is a different story anyway :-).

The lead actors – Om Puri and Mohan Agashe were brilliant. Smitha Patil had a rather small role but, I continue to be amazed by her for her mature portrayal of such roles despite her actual age when she played all these roles. In all, this is a short but strong movie which will “haunt” you as one of the online reviews I read said.

Published in: on September 16, 2013 at 1:54 pm  Comments (1)  

“Shakha Proshakha” and “Ganashatru”

In the past few days, Satyajit Ray occupied my mind quiet a bit, as I was discussing about him with a friend. To address my mind’s constant reminders, I first read a bit of Professor Shonku adventures, thanks to the library. But like before, I liked the imaginative themes but found Prof. Shonku’s narcissism boring. Then, in the past 3 days, I ended up watching “Shakha Proshakha” and “Ganashatru” although I planned on re-watching “Agantuk” and “Hirak Rajar Deshe” (Here is my article on this last one, in Telugu). This blog post is about these two movies.

Shakha Proshakha

“Shakha Proshaka” is the story of 4 generations. A 93 year old man; his son, a 70 year old Anand Majumdar who is successful and well-respected in his town; Ananda Majumdar’s 4 sons and his grand son. Most of the story takes place within Ananda Majumdar’s house where he, his father and one of his sons live. The story centers around the thoughts and discussions between the sons (and their families) when all of them meet to visit Ananda, who is recovering from illness. The story, to me, has multiple layers to it and its hard to put a single thing as its theme (although most web reviews seem to put the idea of “honesty” as its main theme).

What attracted me the most in this movie were: the gripping (even if its slow!) narration, Soumitra’s performance as a seemingly demented son of Ananda Majumdar and the old man who played Ananda Majumdar’s father. The story as seen from different characters in the movie was fascinating and left me thinking at several points. Soumitra was amazing although I felt he did not get enough screen space..the story was designed in such a way that he is a background hero (with all that background music).

I was also curious about the usage of English words in this movie. I think it was while watching “Mahanagar” that I wondered – why is it that they use so many English words and phrases even in 50s and 60s?

Most amusing review I read online was the one where a foreign reviewer left everything else in the movie and expressed disgust at the fact that the family members were eating with their hands in some of the scenes. To be frank, those scenes where the whole family sits at the dining table and speak while eating with their hands (and licking them) were some of the most natural and pleasing ones to my eyes. :-) How much our cultural background affects our perspective!

Here is a blog post I found about this movie.

***

Ganashatru:

“Ganashatru” was adapted by Satyajit Ray from a Norwegian play by Henrik Ibsen, En Folkefiende or “An Enemy of the people“. When I read the play about an year and half ago, I was quite fascinated by the narration. I longed to see “Ganashatru” ever since. Finally, I managed to watch now.

I liked the movie as a seperate entity. I neither expected nor wanted the movie to be faithful to the play. Seeing how Ray adapted Tagore’s “Home and the world” to make his movie, I
knew that this would be Satyajit Ray’s “Ganashatru” and it was. I loved the way it was adapted for Indian scenario. Soumitra was awesome as Dr Ashok Gupta. Three scenes I liked the best in this movie are:
a) the discussion on temple water and its purity, where Bhargav challenges Prof. Gupta saying that temple water can never be unhealthy (because its “holy”!)
b) the scene where Dr Gupta plans a so called “open” public speech but is never allowed to properly read out his letter to the public.
c) the glow in Dr Gupta’s eyes when he comes to know in the climax scene that there is hope after all.

The actor who played Soumitra’s brother looked really menacing. Others too suited well for their roles. Mamatha Shankar, through her simple looks, has a strong scene presence (IMHO). Ray caught the spirit of the play correctly although he took liberties with the content itself (I remember this was exactly how I felt when I watched “Ghar Bhaire”).

****
While watching these, I realized that most of the movies of Satyajit Ray that I watched and liked come from those that were made in later parts of his career :-)

Both the movies are available on youtube. “Shakha Proshakha” is available with subtitles. Regarding “Ganashatru”, you need to figure out a way to watch it with subtitles ;)

Published in: on July 28, 2013 at 6:51 pm  Comments (1)  
Tags:

ఇంద్రగంటి మాయా బజారు

నాకు చాన్నాళ్ళ బట్టీ ఇంద్రగంటి మోహనకృష్ణ తీసిన “మాయాబజార్” సినిమా చూడాలనున్నా కుదరలేదు. ఈమధ్యే యూట్యూబులో కనబడ్డంతో, మొత్తానికి చూసాను. సినిమా కొంచెం వెరైటీగా ఉంది… ఆట్టే నాకు నచ్చలేదు కానీ, కొన్ని ఆసక్తికరమైన సంగతులు ఉన్నాయి..అవి రాసుకుందామని ఈ టపా.

కథా కమామిషూ చెప్పాలంటే, హీరో రాజా ఒక మహా సహృదయం కల మనిషి. తాను తిన్నా, తినకపోయినా అందరినీ ఆదుకునేస్తూ ఉంటాడు. ఇట్టాంటి మనిషికి ఊడిగం చేస్తే గానీ జనాల పాపపు సొమ్ముల్ని మోసే తనకు విమోచనం ఉండదని కుబేరుడు తెలుసుకుని ఇతనికి సాయం చేయడం మొదలుపెడతాడు. అచిరకాలంలొనే ఇతగాడు కోట్లకి పడగెత్తి, అయినా కూడా ఇంతే దయార్ద హృదయంతో కొనసాగుతూ ఉంటాడు. మధ్యలో ఎక్కడ నుంచి వస్తోందో? ఎందుకొస్తోందో? రాజా అంటే అంత ప్రేమ దేనికొ? అర్థం అవకపోయినా – హుందాగా, తెరకే ఒక అందాన్నిచ్చేలా ఉన్న భూమిక. ఇతగాడి అదృష్టం ఇలాగే కొనసాగిందా? రాజా-భూమిక చివ్వరికి పెళ్ళి చేస్కున్నారా? అసలు కుబేరుడు శాపవిముక్తుడయ్యాడా? అసలు ఇంతకీ exact nature of the curse ఏమిటి? – ఇలాంటివన్నీ తెలుసుకోవడానికి ఆ సినిమా చూడండి యూట్యూబులో. mayabazar indraganti అని వెదికితే దొరుకుతుంది. అక్కడ మామూలుగానే కథ, కథనం చాలా వీకు. మళ్ళీ అందులో నేను కాస్త ఉప్పందిస్తే మీరు చూడ్డానికేమీ మిగలదు కనుక ఇంతకంటే వివరాలు ఇవ్వను..

మొత్తానికి నాకు ఆసక్తికరంగా అనిపించిన నాలుగు అంశాలు:

* చాలా చోట్ల సంభాషణల్లో వాడిన భాష బాగుంది. “నీకోసం ఎదురుచూస్తూ ఒక మన్వంతరం గడిచిపోయింది” వంటి డైలాగులు ఆట్టే తెలుగు సినిమాల్లో, అందునా ఇప్పటి సినిమాల్లో కనబడవు .. కనుక, ఈ తెలుగు డైలాగుల కోసం మాత్రం నేను మళ్ళీ ఎప్పుడన్నా చూస్తానేమో ఈ సినిమాని..అనిపించింది నాకు. ముఖ్యంగా క్లైమాక్సు దృశ్యాల్లో డైలాగులు నాకు చాలా నచ్చాయి.ఈ మోహనకృష్ణ గారు ఈసారి మంచి కథని ఎంచుకుని ఇలా చక్కగా సంభాషణలు రాస్తే మళ్ళీ చూడాలనుంది.

* పాటల్లో సాహిత్యం కూడా నేను గమనించినంతలో బాగుంది. పాటలు కూడా బాగానే ఉన్నాయి – మోత లేకుండా ప్రశాంతంగా అనిపించాయి కొన్నైతే. అయితే, నేనాట్టే శ్రద్ధ పెట్టి వినలేదు..మళ్ళీ వినాలేమో.

* సినిమా మొత్తంలో నన్ను అందరికంటే ఆకట్టుకున్న నటుడు ధర్మవరపు. ఆయన సొంత గళంలోనే పద్యాలు, పాటల పల్లవులూ అవీ పాడుకున్నట్లున్నారు సినిమాలో.. వినసొంపుగా ఉన్నాయవి.

* సినిమా చివ్వర్లో అందరూ కలిసి వెంకటేశ్వర స్వామికి నమస్కారం పెట్టడం… ఎప్పుడో నలుపు-తెలుపు సినిమాల కాలంలో శుభం కార్డు పడే ముందు ఇలాంటి దృశ్యాలు ఉండేవి :-) :-) ఇన్నాళ్ళకి చూశా మళ్ళీ అలాంటి దృశ్యం ఒక ప్రధాన స్రవంతి చిత్రంలో.

ఇలాంటి ట్రివియా ఇంకొన్ని ఉన్నాయి కానీ, మొత్తానికి కుబేరుడు, హీరో, హీరోయిన్ – అన్న కాన్సెప్ట్ కొంచెం కొత్తగా, మంచి ఫాంటసీ కథకి వస్తువు కాగల సత్తా ఉన్నట్లు తోచినా, ఈ సినిమాకి కథ అంత గొప్పగా లేదని నాకనిపించింది. ఈ సినిమా చూస్తే, కేవలం ఆ సంభాషణల్లో వాడిన భాష కోసం చూడొచ్చు.ఇంతకీ సినిమాకి మాయాబజారు పేరు పెట్టుకోవడం మాత్రం పబ్లిసిటీ జిమ్మిక్కే అనిపించింది. అంత మాయలేం లేవు అక్కడ.

Published in: on June 21, 2013 at 2:55 pm  Comments (8)  
Follow

Get every new post delivered to your Inbox.

Join 86 other followers