శ్రవణానందం – 3: ఈ ఇల్లు అమ్మబడును

ఈ ఇల్లు అమ్మబడును -డి.వి.నరసరాజు

కథ… ఒక వృద్ధుడు తన ఇంటిని అమ్మకానికి పెట్టి ఉంటాడు. అది దయ్యాల కొంప అన్న పేరు పడ్డంతో ఎవ్వరూ రారు. అలాంటిది ఓరోజు రావికొండల్రావు, రాధాకుమారి (భార్యాభర్తలన్నమాట) వస్తారు. అటుపై, అక్కడ నడిచిన తతంగం ఈ నాటకం‌కథ!

నా మాటలు:
* రావికొండల్రావు-రాధాకుమారి కాంబో రాక్స్.
* ఏమాటకామాటే చెప్పుకోవాలి – సంభాషణలు బాగా నవ్వు పుట్టించాయి.
* సుత్తివేలు-రావికొండల్రావు సంభాషణ అదిరింది.
* నాటకం జరుగుతూ ఉంటే, ఎదురుగ్గా ఈ మూడు పేర్లు పరిచితమైనవి కనుక, మొహాలు కదలాడుతూ‌ఉన్నాయి.
* నాటకం అరగంటే కావడం – కడు శోచనీయం, మహా నేరం, మహా ఘోరం!
* ఎప్పుడో‌యాభైల్లో రాసిన నాటకమట… కావున కొన్ని పదాలు అవీ కొత్తగా అనిపించాయి, ఆ నాటకానికి ముందు అనౌన్సర్ చెప్పినట్లే!
* మాగంటి వారు ఇంకొన్ని నరసరాజు గారి నాటకాలు సంపాదిస్తే బాగుణ్ణు!‌:)

నాటకాన్ని ఇక్కడ వినవచ్చు.

Published in: on October 19, 2010 at 8:00 am  Leave a Comment  
Tags:

శ్రవణానందం 2 – భాగ్యనగరం

ఆమధ్య హైదరాబాదెళ్లినపుడు – ఇంట్లో నార్లచిరంజీవి – ‘భాగ్యనగరం’నాటకం చదివాను. బాగుండింది. మరీ మళ్ళీ‌మళ్ళీ చదవాలి అనిపించలేదు కానీ, ఒక్కసారికి బాగుండింది. ఎక్కడికక్కడ సంభాషణలు చాలా బాగా నచ్చాయి, అలాగే బాపూ బొమ్మలు అంతకంటే నచ్చాయి. పుస్తకానికి నాలుగైదారేడు ముందుమాటలున్నాయి ;) బహుశా, చిరంజీవి గారి మరణానంతరం వేసిన ముద్రణ అనుకుంటాను. ఈ పుస్తకంపై పాజిటివ్ అభిప్రాయమే ఉండటంతో‌మాగంటి.ఆర్గ్ సైటులో ఆడియో నాటకం‌కనబడగానే, వినడం మొదలుపెట్టాను. చాలా చాలా నచ్చింది నాకు.ఆ అనుభవం ఇదీ!

కథ: అందరికీ తెలిసిందే! భాగమతి-కుతుబ్ ప్రేమకథ.

నా వ్యాఖ్యానం:
* మొదట వచ్చిన పాట నాకు తెగ నచ్చింది (ఈ పాట పుసకంలో ఉందా? చూసినట్లు గుర్తు లేదే… చూసి పాట అని తిప్పేసానేమో…సినిమాల్లో పాటలొస్తే ఫాస్ట్ ఫార్వర్డ్ చేసినట్లు!)
* ఒక్కొక్క గాత్రధారీ అద్భుతంగా చెప్పారు డైలాగులు! వీళ్ళూ‌అని ఎన్నలేనంత నచ్చారు నాకు అందరూ. భాగమతి అక్క , అమీర్ – ఇద్దరూ‌ బాగా గుర్తుండిపోయారు… చదివినప్పుడూ, విన్నప్పుడూ.
* డైలాగులు చాలా బాగున్నాయ్!
* కథ చదువుతున్నప్పుడు హీరో కి చంద్రహారంలో రామారావు, హీరోయిన్ కి అనార్కలి లో అంజలీదేవీ గుర్తొచ్చారు. కానీ, నాటకం‌వింటున్నప్పుడు ఆ గొంతులు ఆ ఇమేజ్ కి మ్యాచ్ కాలేదు :)
* అమీర్ పాత్ర డైలాగులు సరదాగా ఉన్నాయి.
* గంట నాటకంలో ఒక్క క్షణం కూడా బోరు కొట్టదు!
* సంగీతం‌ అదీ, చాలా బాగా అమరింది. కరెక్టుగా పుస్తకం చదువుతున్నప్పుడు కదలాడే భావాలే, నాటకం వింటున్నప్పుడూ‌కదలాడాయ్!‌:-)

మొత్తానికి, రేడియో రాకింగు. ఇప్పుడైతే మనకి రేడియో అంటే‌ డీజే లాగా పాటలు మారుస్తూ, ప్లే చేస్తూ ఉండిపోతోంది కానీ, ఒకప్పుడలా కాదన్నమాట!
మాగంటి.ఆర్గ్ వారికి నా ధన్యవాదాలు!

ఈ నాటకాన్ని ఇక్కడ వినండి.

Published in: on October 17, 2010 at 8:00 am  Comments (4)  
Tags:

శ్రవణానందం – ప్రతాపరుద్రీయం

ఈ మధ్య నాకు పాత రేడియో నాటకాలపై మోజు పెరిగింది. సురస, మాగంటి, ఈమాట – ఇలా పలు సైట్లలో వెదుకుతూ, వీలు చిక్కినప్పుడు వినడం మొదలుపెట్టేను. ఒక్కోదాని గురించి చిన్న చిన్న పరిచయాలు రాయడం ఈ శీర్షిక ఉద్దేశ్యం. ఇవాళ – ప్రతాపరుద్రీయం తో మొదలుపెడుతున్నాను.

కథ సంగతికొస్తే : ప్రతాపరుద్ర మహారాజుని మొఘలుల చెరనుండి అతని మంత్రి యుగంధరుడు కాపాడ్డం ఇందులో ప్రధాన కథ.

నా కామెంట్లు:
* ఒకసారి వినేందుకు నాటకం బాగుంది.
* ఏమిటీ…ఇది వేదం వెంకట్రాయశాస్త్రి రాసారా?? నమ్మలేకపోతున్నాను. భాష చూస్తే, మామూలుగానే ఉంది. ఇదివరలో ఇంట్లో ప్రతాపరుద్రీయం పుస్తకం చూసి, చదవబోయి, భయపడి, భంగపడి వదిలేసిన జ్ఞాపకమే! బహుశా, రేడియో అనుసరణలో తేడా ఉందేమో. అయినా, శాస్త్రి గారు శుద్ధ గ్రాంథికం రాస్తారనుకున్నానే!!
* గాత్రధారులు అందరూ చాలా బాగా ‘వినిపించారు’
* పేర్లు పరమ వెరైటీగా ఉన్నాయి: భేతాళరావు, యమధర్మరాజుశాస్త్రులు, విశ్వాసరావు, చెకుముకిశాస్త్రి అంటూ భలే పేర్లున్నాయి. అసలుకి నాకు, ఆ కాలం కథకి యుగంధరమంత్రి అన్న పేరు కూడా కాస్త వింతగానే అనిపించింది.
* కథ గురించి ఐడియా లేకుండా ఈ నాటకం‌ఫాలో కావడం కష్టం. కొంచెం అయోమయంగా అనిపించింది మధ్య మధ్యలో..ఎవరు ఎవరితో మాట్లాడుతున్నారో అర్థం కాలేదు.
* కథ ఎందుకోగానీ నాకు పెద్ద నచ్చలేదు. ఇన్నేళ్ళైనా ఎందుకు ఈ నాటకం వినాలో అర్థం కావట్లేదు. కొత్తగా నాటకాలు రావట్లేదా?
* ఈసారి ప్రతాపరుద్రీయం‌ టెక్స్ట్ చూడాలి – ఈ నాటకానికీ, ఆ అసలు నాటకానికీ ఎంత తేడా ఉందో, ఎంత పోలికుందో!
* అయితే, నాటకంలో ఒక వాయిస్ ఓవర్ ఉంటే బాగుండేది అనిపించింది. దృశ్యాలూ, నేపథ్యాలు మారినప్పుడు వాళ్ళ డైలాగుల బట్టి తెల్సుకోవాలే కానీ, వేరే మార్గాంతరం లేదు. I think its poor direction!

వినేందుకు ఇక్కడ, చదివేందుకు ఇక్కడా క్లిక్కండి.

Published in: on October 15, 2010 at 4:23 pm  Comments (3)  
Tags:
Follow

Get every new post delivered to your Inbox.

Join 68 other followers