కృష్ణశాస్త్రి కవితకు ఆంగ్లానువాదాలు

నాకు ఒక స్నేహితుడి ద్వారా త్రివేణి పత్రిక కు 1928 లో విడుదలైన తొలి సంచిక నుండీ ఇప్పటి వరకూ ఉన్న మొత్తం సంచికలన్నీ అర్కై్వ్స్ లో కనిపించాయి. తొలి సంచికను చూస్తూఉంటే – కనబడ్డది – “A poem by D.V.Krishna Sastry” అన్నది. అంటే దేవులపల్లివారు అని అర్థం కావడానికి నాకు ఓ సెకను పట్టింది. తెరిచి చుస్తే, ఒకే కవితకి రెండు అనువాదాలు! అది మరేదో కాదు… “ఆకులో ఆకునై”…తలచుకుంటే మేఘసందేశం సినిమా గుర్తొస్తోంది…

ఏదేమైనా… తెలుగులో చదివిన ఓ కవితకి ఆంగ్లానువాదం చూడడమే నన్ను ఆకర్షిస్తే, ఒకే కవితకి రెండు అనువాదాలు, అదీ ఒకే చోట, ఒకేసారి కనబడడం మరింత ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ రెండు అనువాదాలు చేసిన వారు – వి.ఎన్.భూషణ్, ఆచంట జానకిరామ్.

ఆసక్తి ఉన్నవాళ్లు : అసలు కవితని ఇక్కడ, అనువాదాలని ఇక్కడ చదవండి.

ఏమాటకామాటే చెప్పుకోవాలి – త్రివేణి పత్రిక సైటు రాకింగ్. ఇప్పుడే మొదలుపెట్టా…ఇలా ఇది కనిపించింది. ముందు ముందు ఇంకెన్ని కనిపించబోతున్నాయో!

Published in:  on November 20, 2009 at 10:51 pm Comments (3)

కథ ఇట్లా ఉండాలె – కథ పై

బస్సులో కూర్చుని – కనుపర్తి వరలక్ష్మమ్మ గారి “కథ ఎలా ఉండాలె?” కు మాలతిగారి ఆంగ్లానువాదం – “The Charm of a cherished story” చదువుతూ ఉన్నాను. ఇదివరలో చదివినదే అయినా, ఈసారి చదివినప్పుడు దాని గురించి మరికాసేపు ఆలోచించాను. ఈ ఆలోచనల్లో నాకు రకరకాల సందేహాలు కూడా కలిగాయి. ప్రస్తుతానికి కథ గురించి చర్చల వల్ల ఇది నాకు నచ్చిన కథ. కనుక, ఈ కథ చదువుతున్నప్పటి అనుభవాలను పుస్తకం.నెట్ లో పంచుకోవాలనిపించింది.

కథ విషయానికొస్తే, ఇది ప్రధానంగా రచయిత అయిన భర్తకూ, అతని భార్యకూ మధ్య కథ అంటే ఎలా ఉండాలి అన్న విషయంపై జరిగిన చర్చ/వాదన. నా మటుకు నాకు కథ అయితే చాలా సహజంగా, ఇంట్లో జరుగుతున్నంత సహజంగా అనిపించింది. వీళ్ళిద్దరూ మాట్లాడుతూ ఉండటం, మధ్యలో ఇంటి పనుల విరామాలు, చివర్లో నిద్రొస్తోందని చర్చ ముగియడం – ఇదంతా అతి సహజంగా ఇంట్లో జరిగే దానిలా అనిపించింది. ఎటొచ్చీ, కథకి నాటకీయత అవసరం అని చాలా బలంగా నమ్మేవాళ్ళు కూడా ఉండే ఉంటారు – వాళ్ళకి ఇది అసంపూర్ణ కథ కావొచ్చు. కథ అన్నాక – ఫలానా టెంప్లేట్లలో ఏదో ఒకదానిలోకి ఒదగాలి – అని బలంగా నమ్మేవాళ్ళకి కూడా ఇది బహుశా నచ్చదేమో. కథల స్ట్రక్చర్ విషయంలో నేను అనార్కిస్టుని కావడం ఈ కథని స్వేచ్ఛగా ఎంజాయ్ చేసి, దీనిలో చెప్పిన విషయాల గురించి ఆలోచించడానికి ఉపకరించిందేమో.

“కథ” అన్నదాన్ని ఓ డెఫినిషన్లో ఇరికించడం ఎలాగో నాకు అర్థం కావట్లేదు. ఈ కథ చదివాక అసలు అర్థం కావట్లేదు. అందుకు ఈ కథ రూపం కారణం కావొచ్చేమో కానీ, ప్రధానంగా ఇక్కడ చర్చించిన విషయం కారణం. ఈ కథలోని కొన్ని వాక్యాలూ – నా ఆలోచనలూ:
” The stories that are just intended to make the reader laugh are insipid”
- ఇది చాలా అన్యాయం అనిపించింది నాకు. How can a comedy story be insipid? పైగా, కొన్ని కొన్ని మూడ్లలో ఉన్నప్పుడు హాస్యకథలు మనల్ని అందులోంచి బయటకు కూడా తేగలవు. రాసిన ప్రతి హాస్య కథా వందల సంవత్సరాలు నిలువకపోవచ్చు – కాల ప్రవాహంలో పడి కొట్టుకుపోవచ్చు – కానీ, అది చదువరికి హాయినిచ్చినంతకాలం అది “ఇన్సిపిడ్” ఎలా ఔతుంది? హాస్యమంటే – నిజజీవితంలో జరిగే హాస్యం కానక్కరలేదా? రోజూవారీ జీవితంలో హాయిగా నవ్వుకునే సందర్భాలను తీసుకుని కథాంశాలుగా రాస్తే, ఎందుకు అవి ఇన్సిపిడ్ ఔతాయి?

’Every story must include a truth of ethical or scientific value. It is only then the writer’s effort is rewarded.”
- మళ్ళీ, ఎందుకు ఉండాలి? అన్నది నా సందేహం. కథ ఎందుకు రాస్తారు? అంటే “సాంఘిక ప్రయోజనం” అన్నది ఒకటేనా జవాబు? “హాస్యం” కూడా ఒక విధంగా సాంఘిక ప్రయోజనమే అలా అంటే :) కథలో ఒక రకం జీవితాన్ని చూపించాలి అని రచయిత అనుకున్నాడు అనుకుందాం – చూపాడు అనుకుందాం. ఇందులో అన్నిసార్లూ సాంఘిక ప్రయోజనం ఉండాలి అని ఏముంది? – అలాగే, ప్రతి కథలోనూ ఎథికల్, సైంటిఫిక్ విలువలు ఉండాలి అని ఏముంది? మళ్ళీ “హాస్యాన్ని” ఉదాహరణగా తీసుకుంటాను. నేనో దిగాలుపడ్డ మనసుతో కూర్చుని ఉన్నప్పుడు ఏదో కథ చదివి, నవ్వుకుంటూ, చీరప్ అయితే, రచయిత కృషికి ఫలితం దక్కినట్లు కాదా?

’if the purpose of a story is only to provide a temporary pleasure, if love is the only theme, if you cannot write any better than that, and if the readers cannot enjoy anything better than that, then, I would say that both the writers and the readers are self-indulgent”
- “ప్రేమ” కథలు రాస్తే మాత్రం తప్పేంటి? ప్రేమ అన్నది మనుషుల్లో ఉండే సహజ రసం. కథల్లో సహజ రసాన్ని చూపడంలో అంత తప్పేముంది? తాత్కాలిక ఆనందం కల్పించేది కథ ఎందుకు కాకూడదు? అన్నది నా ప్రశ్న. కథకి ఏకైక లక్ష్యమే ఎందుకుండాలి? చాలా లక్ష్యాలుండి వాటిలో తాత్కాలికానందం ఒక కోణం ఎందుక్కాకూడదు?

“There are two kinds of stories—the best and the mediocre. The best stories are those, which contain style, freshness, clever descriptions, creativity, suitable rasa, and ethical values. Such stories will receive permanent status in literature; readers receive them well. They never become old.”
-ఇక్కడి వరకూ బానే ఉంది. కానీ, తరువాత:
“The mediocre stories will have all the elements but no moral values. These mediocre stories are also written in powerful and living language, do include fine descriptions, and the structure and characterization are not bad either. They may not be lacking in rasa; yet, they do not attain a permanent place in literature for want of a compelling moral value. These stories have served their purpose just by providing a momentary pleasure to the readers.”
అన్నారు. అంటే, కలకాలం నిలిచే కథల్లో తప్పితే మిగితా కథల్లో నైతిక విలువల్లేవనా? అసలు రెండే రకాల కథలు అని చెప్పేయడమే నాకు అన్యాయమనిపించింది. దానికి తోడు, కలకాలం నిలిచే కథల్లో తప్ప నైతిక విలువలు ఉండవంటే ఎలా? ఈ వ్యాఖ్యానాలన్నీ ఎలాంటి కథల్ని ఉద్దేశించి అన్నారో -
“In the name of nature, if you describe everything regardless of propriety, it turns into vulgarity. The reason the modern day stories are reprehensible is those descriptions. Description should not cross the line of propriety even if it were natural.”
-అన్న వర్ణన బట్టి తెలుస్తోంది కానీ, అలా ఆలోచించినా కూడా కథలు ఉంటే మొదటి కేటగిరీలో లేకుంటే రెండోదానిలో ఉండటం అసాధ్యం అనిపిస్తోంది. ఇంకొన్ని కేటగిరీలు అవసరం :)

“And then the third rate stories are those which are written without any talent; and often written in some foolish way; probably the writer gets excited at the sight of a woman and writes about her. Most of the stories now being published in Telugu magazines nowadays belong to this category.”

- నో కామెంట్స్. నాకు తెలీదు. చదివేవాళ్ళు అవి కూడా చదువుతారు కదా మరి! థర్డ్ రేట్ సరే – కానీ, వాళ్ళేమీ వచ్చి నేను ఫస్ట్ రేట్ అనరు కదా (అంటారా?)

చివర్లో భార్య మాటలన్నీ వింటూ ఉన్న భర్త : “A story could be a moral story like in sumati satakam or vemana poems. But it’s not smart to suggest that each and every story must fit into a paradigm of moral value. A story is like a flower. It must blossom freely and pleasurably or else it would lose its beauty and become insipid. To speak the truth, story writing is an artistic creation. And it is the duty of the connoisseurs of art to make sure that it serves a purpose” అంటాడు. వీళ్ళ చర్చలో ఉంటే మోరల్ స్టోరీ, లేకుంటే ఇమ్మోరల్ స్టోరీ అని రెండే రకాలు ఉన్నట్లు ఉన్నా కూడా నా దృష్టిలో అలా కాదు కనుక, నాకు ఈ వాక్యం చదువుతూ ఉంటే. “It must blossom freely and pleasurably ” అన్న భాగం చాలా కరెక్టనిపించింది.
“That’s good. If you ride on a moral high horse, and create only allegories, I don’t have to tell you about the outcome. People will be happy without reading them.”
ఔను నిజం ఔను నిజం! :)

నన్ను ఏళ్ళ తరబడి పట్టి పీడిస్తున్న సందేహం ఇక్కడ మళ్ళీ వచ్చింది, ఈ కథలోని భార్య పాత్ర ద్వారా:
“I’m saying that only when you write stories with moral values, their worth heightens. And people will welcome them. Not only Telugu people but others also translate them into their languages and read them. Look at the stories of Tolstoy and Premchand. Aren’t they getting translated into Telugu? Why did they receive that kind of attention? “
-అంటే, మోరల్ స్టోరీలు తప్ప వేరే భాషల్లోకి అనువాదం కావా? అంటే, మన కథలు ఇతర భాషల్లోకి అంత విరివిగా అనువాదం కాకపోడానికి కారణం ఇదా? నాకు ఈ జవాబు అంత నమ్మదగ్గదిగా లేదు. వేరే భాషల్లోకి అనువాదాలయ్యే కథలన్నీ ఇలా గొప్ప విలువలున్నవేనా? అలా అంటే, “విలువలు” అన్న పదం కిందకి ఏమేమి వస్తాయి?

ఈ కథ చదివినప్పట్నుంచీ ఇవే సందేహాలు నాలో. అన్నింటికంటే సూటిగా తగిలినది ఈ చివరి వాక్యం!
ఎంతకీ తెగడంలేదు ఆలోచనలు.

ఎప్పుడో నలభైల్లో రాసిన ఈ కథ ఇప్పుడు చదివినా కూడా ఇలాంటి సందేహాలే కలుగుతున్నాయంటే… ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు…

Published in:  on August 17, 2009 at 2:35 pm Comments (3)
Tags:

ఉపమ Vs Symbolism

కొన్ని నెలల క్రితం “రక్తరేఖ” (గుంటూరు శేషేంద్ర శర్మ గారి ‘డైరీ’) చదువుతున్నప్పుడు చదివిన ఓ చర్చ ఇది. ఈ చర్చ నాకు ఆసక్తి కరంగా అనిపించటమే కాక – కొన్ని సందేహాలను కూడా పుట్టించింది. అందుకే ఆ పేజీలలోని ఒకట్రెండు డైలాగులలోని కొన్ని భాగాల్ని ఇక్కడ పెడుతున్నాను. ఎక్కువ పెడితే కాపీరైట్ ఉల్లంఘన ఔతుందేమో మళ్ళీ!

ప్ర: ఉపమాలంకారంలోని ఉపమేయాల్ని తీసివేసి కేవలం ఉపమానాలతోటే వాక్యవ్యవహారం నడుపుతామనుకో, అది సింబాలిజం ఔతుందా? ….. (ప్రశ్న ఇంకా ఉంది…)
జ: కాదు. ఉపమాలంకారంలో రెండు వస్తువులుంటాయి. ఆ రెంటికీ కొన్ని లక్షణాలుంటాయి. ఆ పోలికల మూలంగా ఒకదానితో ఒకటి పోల్చబడతాయి. కానీ, సింబాలిజంలో ఒకటే వస్తువు ఉంటుంది. దానిలోనే రెండవ వస్తువు ఉంటుంది. బయటికి కనిపించేది భౌతిక వస్తువు., మామూలు కళ్ళకి కనొపించకుండా లోపల ఉండేది రెండ్వ వస్తువు… (and it goes on.)

సింబాలిజం : అన్న దానికి తెలుగు పదమేమిటి ఇంతకీ? అన్నది నాకొచ్చిన అనుమానం :)

ప్ర: “ముఖ చంద్రుణ్ణి కష్టాల మేఘాలు ఆవరించాయి” అంటే రూపకం అయింది (రూపకాలంకారం). ఇక్కడ ముఖమూ, చంద్రుడూ అనే రెండు వస్తువులకూ అభేధం చెప్పడమే కదా ఈ అలంకార లక్షణం?”
జ: రెండు వస్తువులకు అభేదం చెప్తున్నాడు నిజమే. కానీ, అవి నిజంగా ఒకే వస్తువు కాదు కదా; రెండు వస్తువులే కదా. కానీ, లారెన్సు చెప్పిన వాక్యం చూడు – “ఎర్రగులాబీ పువ్వు అగ్నిజ్వాల”. ఇక్కడ ఎర్రగులాబి, అగ్ని జ్వాల రెండు వస్తువులు కావు. భౌతిక ప్రపంచంలో రెండైనా ఇక్కడ కవి ద్రష్ట అయిన సన్నివేశంలో ఎర్రగులాబీలోనే ఆ అగ్నిజ్వాలను చూశాడు.

……………………..
……………………….
“ఇలా ఒక స్థూల దృశ్యం ఐన ఒక భౌతిక దృశ్యంలోంచి దాని తాత్విక దృశ్యాన్ని చూడటం, అంటే ఒక వస్తువులోంచి దాని వాస్తవికతను పిండుకోవడం సింబాలిజం”

- ఇదీ ఆ చర్చ. చాలా ఆసక్తికరంగా ఉండింది. ఆఖరుకి నాక్కూడా ఎప్పుడో స్కూల్లో వదిలేసిన గ్రామరూ, అలంకారాలు, ఛందస్సు మీద ఆసక్తి పుట్టింది ఇది చదివాక :)

Published in:  on August 2, 2009 at 2:06 pm Comments (9)

మ్యూజింగ్స్ లోని ఓ వాక్యం

చలం మ్యూజింగ్స్ లోని ఓ వాక్యం…అది చదువుతున్న కాలం లో వాడిన నోటు పుస్తకాన్ని దేనికోసమో తెరిస్తే ఉన్నట్లుండి కనిపించింది (అది క్లాసు పుస్తకమే లెండి..నేనలా వాడుకున్నా…హీహీ)… అప్పట్లో నవ్వొచ్చే రాసుకున్నాను…ఇప్పుడు చదివాక మళ్ళీ నవ్వొచ్చింది…అందుకని ఇక్కడఆ వాక్యాన్ని టైప్ చేసి పెడుతున్నాను…

ఏ దుర్గుణం అసలు ఏమీ ఎవరిలో ఏమాత్రమూ లేదో, అది లేదని ఎవరూ గుర్తించరు. “ఆహా! ఈ దుర్గుణం మీలో లేదు” అని ఎవరన్నా సిన్సియర్ గా అన్నారా, ఆ దుర్గుణం కొంచెంగా ఆ అనబడ్డవారిలో, అంతకన్నా అధికంగా ఆ అనేవారిలో ఉందన్నమాటే. ఎవరన్నా పెద్దమనిషితో ఇంకొకరు – “తమరు చాలా పుణ్యాత్ములండీ, పసిపిల్లని నిష్కారణంగా గొంతు పిసకరు” అంటారా? అంటే విన్నవారు అనుమానపడరా; ఆ ఇద్దరిని గురించీ?

- :)

Published in:  on December 4, 2008 at 2:12 pm Comments (7)

Why do you write? ;)

Heres an excerpt from “The Fountain Head” by Ayn Rand. Out of boredom, I re-visited the book and was opening pages randomly and reading…. Found this particular passage particularly apt to me :)

Scene: The first conversation between Peter Keating and Dominique Francon.

*************************************************************************************

Keating: ….Why do you write if you have nothing you want to say?

Dominique: To have something to do. Something more disgusting than many other things I could do. And more amusing.

Keating: Come on, thats not a good reason.

Dominique: I never have any good reasons.

Keating: But you must be enjoying your work?

Dominique: Iam. Don’t you see that I am?

*************************************************************************************

Hmm, so now I have a documented answer to anyone who asks me – “Why do you blog at all?” ;)

Published in:  on November 14, 2008 at 12:58 pm Comments (2)

శ్రీశ్రీ పై శ్రీరమణ

శ్రీరమణ గారి పేరడీలు చదువుతూ ఉంటే, శ్రీశ్రీ శైలికి పేరడీ రాస్తూ, రాసిన “శ్రీస్కీ” వ్యాసం ఇలా మొదలైంది -

“శ్రీశ్రీ కి కుదురు తక్కువ. అసలే మెలిక “శ”, దానిపైన గుడి, దానికి పొల్లు – అడుగున కొయ్యగుర్రం పీఠంలా క్రావడి, పోనీ ప్రక్కనైనా వ్యాట్ సీసాలా పొట్టిగా గట్టిగా నిలబడగల అక్షరం ఉందా అంటే అది కూడా శ్రీనే. ఇక శ్రీశ్రీ కి కుదురు ఎలా ఉంటుంది? అయినా, యుగకలం ఆయన చేతిలో ఉంది -మరి ఆ కలం కదిలినా, కక్కినా కూడా అందమే”

-శ్రీరమణ పేరడీలు. (ముద్రణ – 1980. ఇదే ప్రథమ ముద్రణ)

Published in:  on October 18, 2008 at 10:18 pm Comments (9)

“ఆంధ్ర దేశం” వెనుక కథ

నేను ఇప్పుడే విశ్వనాథవారి పన్నెండు సంపుటాల “పురాణ వైర గ్రంథమాల” లోని మొదటి పుస్తకం “భగవంతుడి మీద పగ” చదవడం మొదలుపెట్టాను. ఇందులో Andhra కి ఆంధ్ర దేశం అన్న పేరు రావడం వెనుక ఒక కథ చెప్పారు…అది ఆసక్తి కరంగా అనిపించి ఇక్కడ మీతో పంచుకుంటున్నాను.

ఇదివరలో శుక్రాచార్యుడి కుమార్తె దేవయాని ని పెళ్ళి చేసుకున్న యయాతి ఉండేవాడు కదా… అతనికి ఐదుగురు కుమారులట. వారిలో అనువు అనేవాడొకడు. ఆ వంశంలో బలి అని ఒక రాజు ఉన్నాడట. అతను భారతదేశం యొక్క తూర్పు ప్రాంతాన్ని పాలించేవాడు. దానికి ప్రాచ్యకదేశమని పేరు. (అప్పటి భారత దేశమంటే… దానిలో ఏవేవి ఉండేవో మరి…అది రాయలేదు అక్కడ) అతనికి ఆరుగురు కొడుకులట – అంగరాజు, వంగరాజు, కళింగరాజు, సుంహరాజు, పుండ్రరాజు మరియు ఆంధ్రరాజు! ఆ బలి తన ఆరుగురు కొడుకులకీ తన రాజ్యం విభజించాక, కృష్ణా గోదావరీ నదుల మధ్య ఉన్న భాగం ఆంధ్ర రాజుకి వచ్చింది. అప్పట్నుంచి ఈ ప్రాంతాన్ని ఆంధ్ర దేశమంటున్నారట.

- ఈ పరంగా కథ బానే ఉంది కానీ, దక్షిణాన్ని తూర్పు అని అన్నారంటే, అప్పుడు దేశం ఎలా ఉండేదో అని నాకు మహా కుతూహలంగా ఉంది. లేకుంటే, దక్షిణాన ఉన్న తూర్పు దిక్కా? అసలు బలి రాజు రాజ్యం సరిహద్దులేమిటో! ఈ విషయాన్ని దేని ఆధారంగా చెప్పారో అక్కడ రాయలేదు కనుక, సొంత సెర్చి చేసుకుని రిసర్చుకోవాలని మాత్రం అర్థమైంది :(

Published in:  on October 6, 2008 at 1:40 pm Comments (11)

A quote by Romain Rolland

I was reading “Musings” by Chalam, where I found this quote, which appeared quite interesting and relevant:

“Write it simple, as simple as its unfolding. Waste no thought upon the word and the letter, and the subtle vain researches, in what the force of the artists today is turned in to nought. You are addressing all men. Use the language of all men. There are no words noble or vulgar. There is no style chaste or impure. There are only words and styles which say exactly what they have to say. Be sound and thorough in all you do. Think just what you think and tell just what you feel. Let the rythm of your heart prevail in your writings. The style is the soul.”
-Romain Rolland

Any comments?

Published in:  on August 19, 2008 at 12:41 pm Comments (11)

దీపం – తిలక్ కవిత

తిలక్ “అమృతం కురిసిన రాత్రి” సంకలనంలో “దీపం” కవిత చదువుతూ ఉన్నా రాత్రి. అందులో కొన్ని లైన్లు:
“చీకట్లో చీకటి కనబడదు
దీపం పాపం వంటి చీకటిని చూపెడుతుంది.
దీపాల మధ్య చీకటి దివ్యంగా మెరిసిపోతోంది.”
….. ఇలా సాగాక, ఒక చోట
“ప్రాణంలోంచి పాపం, పాపం లోంచి ప్రాణం పుట్టాయి
పాపాన్ని చూసి పాపం అని జాలిపడడం పుణ్యం అని చెప్పాయి
సమాధి మీద దీపం చావుని వెలిగించి చూపుతుంది
దేవాలయంలోని దీపం దేవుని బంధిఖానాని తెలుపుతుంది
ఇంటిముందు పెట్టిన దీపం ఇంటిలోపలి గుట్టుని దాచుతుంది”
- ఇక్కడే నాకు సందేహం… ఇంటిముందు పెట్టిన దీపం ఇంటిలోపలి గుట్టుని దాచడం ఏమిటి?  ఈ వాక్యం అర్థం కాలేదు నాకు. చదివిన వారికి అర్థమైతే వ్యాఖ్య రాయగలరు.

Published in:  on August 11, 2008 at 10:38 pm Comments (17)

మళ్ళీ మూడు కథలు!

గత టపా రాసి వారమైనా కాకుండానే మళ్ళీ అలాంటి టపా తోనే రావడం వెనుక కారణాళేం లేవు. అంతా నా రాత :) ఆ టపా, ఈ టపా-రెండూ నా రాతే… రెంటినీ నా చేత రాయించిందీ నా రాతే :) “తెలుగు కథకి జేజే” అన్న సంకలనం చదవడం మొదలుపెట్టాను. మొదటి నాలుగైదు కథలూ… పెద్ద పేర్లవి అయినా కూడా నాకు నచ్చలేదు. సుమారు ఎనభై కథలున్న పుస్తకంలో మొదటి ఐదూ అలాగయ్యేసరికి కాస్త దిగులు పడ్డా, ఆరో కథ నన్ను ఆ దిగులు నుండి బైట పడేసింది. మళ్ళీ మూణ్ణాలుగు కథలు….లోపలికి తోసాయి… ఈ దాగుడుమూతల్లో ఉండగా చదివిన రెండు కథల గురించి ఈ టపా…. మూడో కథ…. మళ్ళీ వీటిలో ఒకటి చదువుతూ ఉంటే గుర్తొచ్చిన అలాంటి మరో కథ.

మొదటి కథ – బమ్మిడి జగదీశ్వరరావు కథ “ఆవు-పులి”. మనం చిన్నప్పట్నుంచీ వింటున్న కథాంశాన్నే తీసుకుని వేరే దృక్పథంలో రాయబడిన కథ. కథ మటుకు కథ పర్వాలేదు. కాస్త హడావుడిగా ముగిసినట్లు అనిపించినా కూడా, ప్రస్తుతం నా ఉద్దేశ్యం దాని శైలిని చర్చించడం కాదు కదా… ఈ కథ చదువుతూ ఉంటే కాస్త ఆశ్చర్యానికి లోనయ్యాను. ఎందుకంటే ఇదే థీం ఇంకో కథలో చదివి ఉండటమే. “ఎ మ్యాటర్ ఆఫ్ నో ఇంపార్టన్స్” (A matter of no importance) అన్న బీనాదేవి కథల సంకలనం లో కూడా ఓ ఆవూ-పులి కథ ఉంది. దాని టైటిల్ ఇప్పుడు గుర్తు రావట్లేదు కానీ, అది కూడా ఇలానే ఆ కథ తీసుకుని కాస్త వ్యంగ్యం,బోలెడు హాస్యం జోడించి రాసినది. అప్పట్లో ఆ కథ చదివి బోలెడు నవ్వుకున్నాము ఇంటిల్లిపాదీ. “తెలుగు కథకి జేజే” తో సమస్యేమిటంటే, ఈ కథలు ఏ సంవత్సరంలో..ఏ పత్రికలో అచ్చయ్యాయి…వంటి వివరాల్లేవు. కనుక, రెంటిలో ఏది ముందు రాసారో తెలుసుకోడం కష్టం నాకు. ఎటొచ్చీ, బీనా దేవి గారి కథ ఆకట్టుకున్నంతగా జగదీశ్వర రావు గారి కథ నన్ను ఆకట్టుకోలేదనుకోండి…అది వేరే విషయం. కానీ, నాకింకా ఆశ్చర్యంగానే ఉంది…. ఒకే విషయం మీద ఇద్దరూ కథ ఎలా రాసారా అని….

మూడో కథ – ఆ సంకలనం లోని “ఇల్లలకగానే” అన్న పి.సత్యవతి గారి కథ. పేరు మర్చిపోయిన ఈగ కథ ఉంటుందే…. ఆ కథ ని ఆధారం చేసుకుని రాసిన కథ. ఓ ఇల్లాలు ఇల్లలుకుతూ అలుకుతూ తన పేరు మర్చిపోతుంది ఇందులో. ఇక అందర్నీ అడుగుతూ ఉంటుంది…. “అమ్మ గారు” “అమ్మ” “ఏమోయ్” “పెద్దమ్మాయ్” “మిసెస్ మూర్తి” అందరూ ఇలా గుర్తు పెట్టుకుంటారే గానీ తన అసలు పేరు ఎవరికీ గుర్తు ఉండదు. పేరు కనుక్కుందామని పుట్టింటికొస్తుంది. అక్కడ నానా తంటాలూ పడి, పాత సర్టిఫికెట్ల కోసం కూడా వెదుకుతుంది… చివర్లో ఓ స్నేహితురాలు తనని పిలవడంతో తన పేరు తెలుసుకుంటుందన్నమాట. కథ పరంగా ఇది కూడా చాలా త్వరగా ఐపోయినట్లు అనిపించింది కానీ, చదవడానికి బానే ఉంది.

- ఒకే రోజులో, ఒకే సంకలనం లో ఉన్న రెండు ఇలాంటి కథలు…అంటే… పాత కథల ఆధారంగా రాసిన కథలు…చదవడం నాకు కాస్త వింతగా ఉంది. అందుకే ఈ టపా :) పేరు మర్చిపోయిన ఈగ కథ… ఆవు-పులి కథ…. వినని వాళ్ళెవరైనా ఉంటారా చిన్నతనం లో? కనీసం తెలుగు వారిలో??  ఇంతకీ ఆ రెండు కథల్నీ కనిపెట్టిందెవరో!

Published in:  on June 7, 2008 at 4:07 am Comments (7)