“క్షణక్షణముల్…” అని చుక్కలు పెట్టేసి వార్తల్లో బానే వాడతారు. “…జవరాల చిత్తముల్” వరకూ కొన్ని కథల్లో వాటిల్లో వాడతారు. ఇన్నాల్టికి మూలపద్యం చదివాను
ఇలాంటి పద్యాలు ఎవరన్నా ఆడ కవయిత్రులు మగవారిపై రాసి ఉంటె ఎంత బాగుండేదో!
కానీ, నేను చాలా-అతి మంచిదాన్ని కనుక, అబ్బాయిల సౌకర్యార్థం, ఇది కూడా పంచుకుంటున్నాను. మళ్ళీ “మనుచరిత్రలో మణిపూసలు” పుస్తకం నుంచి తీస్కున్న “మనుచరిత్ర” పద్యమే. మొత్తానికి నాకు ఈ మనుచరిత్ర కథ అంతగా నచ్చలేదు కానీ, ఇలాగ మధ్య మధ్యలో కొన్ని పద్యాలు మాత్రం బాగున్నాయి. ఎప్పుడో, నా తెలుగు బాగుపడ్డప్పుడు మణిపూసలు దాటి ముందుకు వెళతాను ఏమో.
ఒక్కకవేళ- పద్మముఖు లొల్లమి సేయుదు, రొక్క వేళ-పెన్
మక్కువ నాదరింతురు; క్షణక్షణముల్ జవరాండ్ర చిత్తముల్,-
పక్కున వేసరన్ చన, దుపాయములన్-తగు నచ్చకంబులన్-
చిక్కగ చేసి, డాసి, సతి చిత్తము-పట్టి, సుఖింపగా-తగున్.
ఎంత తెలుగురాని తెలుగు వారైనా… ఈ పద్యం అర్థం చేసేస్కుని ఉండొచ్చు అని నా అనుమానం. అయినా…ఇంతకీ అల్లసాని పెద్దన వారు వరూధినిని ఆకర్షించాలని ప్రయత్నిస్తున్న ఒక గంధర్వుడి స్వగతంలా చెప్పిన ఈ పద్యానికి అర్థం:
- ఒక్కొక్కసారి ఛీకొడతారు, ఒక్కొక్కసారి ప్రేమతో ఆదరిస్తారు – ఈ ఆడవాళ్ళ మనసులు క్షణక్షణానికీ మారుతూ ఉంటాయి. అలాగని ఊరికే ఫ్రస్ట్రేట్ అయిపోక, తెలివిగా మాటలు కలిపి, దగ్గరకు చేరి, వారిని ఆకర్షించాలి అని ఉపదేశం అనమాట.
ఇది ఒక అబ్బాయికి చెప్పగానే తక్షణ స్పందన – “టైంలెస్ క్లాసిక్!!” అని.
thanks for sharing
“ఎంత తెలుగురాని తెలుగు వారైనా… ఈ పద్యం అర్థం చేసేస్కుని ఉండొచ్చు అని నా అనుమానం”
Cha!