ఒక్కొక్కసారి ప్రైజులు కట్టలేని సర్ప్రైజులు రావొచ్చు.
ప్రైజులకి అందనంత ఆనందాన్ని కూడా సర్ప్రైజులు కలిగించవచ్చు.
ఆ సర్ప్రైజుల వెనక ప్రైజులు కొందరికి ఆశ్చర్యం కలిగించవచ్చు.
సర్ప్రైజులు కలిగించినంత ఆనందంతో సమానమైన గాబరా ప్రైజులు కలిగించవచ్చు.
ప్రైజుల గోల నీకెందుకోఇ? అని మందలింపులు అందుకోనూ వచ్చు.
వెధవనవ్వు నవ్వనూ వచ్చు.
అంత సర్ప్రైజూ అయ్యాక -
మాట పడిపోవచ్చు, గుండె కరిగిపోవచ్చు.
ప్రేమ కారిపోవచ్చు, మనసు జారిపోవచ్చు.
థాంక్స్, అనేసి ఊరుకోలేక పోవచ్చు
కానీ, ఇంకేం చేయలేం అని అర్థమూ కావొచ్చు.
అయినా సరే-
మనమేం చేయగలం? – అని మనం ఆలోచించనూ వచ్చు.
“చీ! ఇదేమన్నా బార్టర్ సిస్టమా?” అని అంతరాత్మ చీవాట్లు పెట్టనూ వచ్చు
పోనీ ఊరుకుందామా? అంటే మళ్ళీ అంతర్ఘోష రానూవచ్చు
ఏం చేయాలో తెలీక దానికదే మూగబోనూ వచ్చు.
విధి ఎంత బలీయమైనది!
ఇది అంతకంటే బలీయం అనమాట ![]()
ఒక ఏడెనిమిది భాషల్లో నైనా…సర్ప్రైజుని ఏమంటారో కనుక్కోవాలి!
******************
Pleasant Surprises వచ్చినప్పుడు ఆ మూమెంట్స్ బాగుంటాయి లెండి లైఫ్ లో
)
మీకేదో జీడిపప్పు పాకం పంపినట్లున్నారెవరో, చక్కగా తినేయటమే, చిన్నచిన్నగా కొరుక్కుంటూ
Unpleasant surprises నే మింగలేం , వెనక్కి పంఫలేం. మనతోనే ఉండిపోతాయి సన్నాసివి అవి
ఇంతకూ ఏమిటో ఆ ‘సర్ప్రైజు’?
బాగా చెప్పారు! ఈ టపా చదువుతుంటే నాకు కప్పలు అప్పాలయిపోవచ్చు, సున్నం అన్నం అయిపోవచ్చు అనే పాట గుర్తుకొచ్చింది.
ఆశ్చర్యం (తెలుగు), సోర్ప్రేస (స్పానిష్, ఇటాలియన్, పోర్టుగీస్) ; హమ్మయ్యా! నాలుగు భాషల్లో ఏమంటారో చెప్పేసానోచ్చ్!
Really this is a surprise!
hahaha
)))) bhale raasaaru