ఇందాకే, సిటీబస్సు ఎక్కగానే,ఒక పెద్దావిడ పక్కన ఖాళీ సీటు కనబడ్డంతో కూర్చున్నా. సాధారణంగా నేను బస్సులో కొత్త మనుషుల్ని పలకరించను. నవ్వి ఊరుకుంటా. నాకు భయం మనం ఏం మాట్లాడతామూ…వాళ్ళేం అర్థం చేసుకుంటారూ అని. ఈవిడ నేను కూర్చోగానే, హలో అన్నది. నేనూ హలో అన్నా. ఆ తరువాత, చక్కగా జర్మన్లో – “సూర్యుడు వెళ్ళిపోయాడు, చలి కప్పేస్తోంది” అన్నది. నాకు మొదటి భాగం అర్థం కాలేదు. “నాకు జర్మన్ అంతగా రాదు” అని జర్మన్లో చెప్పాక ఆవిడ ఇక మింగేసేలా చూసి మాట్లాడరేమో అనిపించినా, జవాబు ఇవ్వకపోతే ఇంకా అమర్యాదకరంగా ఉంటుందని, నాకు పెద్దగా జర్మన్ రాదని చెప్పేశా. దానితో ఆమె ఇంగ్లీషులో మాట్లాడాక ఊపిరి పీల్చుకున్నా.
ఇక్కడ నుంచి ఆ పది పదిహేను నిముషాల ప్రయాణంలోనే భలే సాగింది సంభాషణ. నా చేత జర్మన్ ప్రాక్టీస్ చేయించాలని ఆవిడ కంకణం కట్టేశారు. ఓపిగ్గా ప్రతీదీ జర్మన్లో అడగడం/చెప్పడం నేను అర్థమైనంత అర్థం చేస్కుని, ఇంగ్లీషులో జవాబిస్తూంటే ఆవిడ సరిగ్గా అర్థం చేస్కున్నానో, లేదో చెప్పడం : ఇలాగ. ఇక్కడ నాకు తారసపడ్డ వారిలో సాధారణంగా నూటికి తొంభై ఐదు శాతం మంది నాతో బానే మాట్లాడారు కానీ, ఈ వయసు వారితో ఇప్పటిదాకా ఇంత స్నేహంగా సాగిన సంభాషణ లేదు
ఊరికే నేను “నా మట్టుకు నాకు జర్మన్లు స్నేహంగానే ఉన్నట్లు అనిపిస్తారు” అని చెప్పిన ప్రతిసారీ “చ, నిజమా” అంటూ నా వైపు జాలిగా చూసే నా సహోద్యోగులకు (వీళ్ళలో చాలా మంది జర్మన్లే అయినా కూడా ఏమిటో వాళ్ళు అంత స్నేహంగా ఉండరని వాళ్ళే అంటారు..హీహీ) ఈ బామ్మగారిని చూపించాలి అనిపించింది వెంటనే!
“చ, నిజమా”
“నా మట్టుకు నాకు జర్మన్లు స్నేహంగానే ఉన్నట్లు అనిపిస్తారు”
I agree. This matches with my experience too.
@ ఈ బామ్మగారిని చూపించాలి అనిపించింది వెంటనే! – ఈమధ్య నువ్వు పెద్దవారిగురించి రాసినవి చూస్తున్నా. నీకు పెద్దవారితో స్నేహం మంచినీళ్ళప్రాయం అనుకున్నా ఇంతకాలం :p
సరిగ్గా ఇలాంటి అనుభవమే నాకు కూడా ఓ సారి ఎదురైందండి. ఒక తమిళ్ అతను ఏదో తమిళ్ భాషలో అడిగితే నేను అతనితో తమిళ్ లోనే నాకు తమిళ్ రాదు అని చెప్పా. అంతే అతడు పైకి, కిందకి ఎగా దిగా చూసి కోపంగా వెళ్ళిపోయాడు. నేను అప్పుడప్పుడే తమిళ్ నేర్చుకుంటున్నాను. అతనిపై నాకు వచ్చిన తమిళ్ భాష ప్రయోగించాను. బాగా పని చేసింది.
yes..i agree with you. helpful ga untaru