“పీహెచ్డీ కామిక్స్” గురించి ఈ బ్లాగు పాఠకుల్లో ఎంత మంది విని ఉన్నారో నాకు తెలీదు కనుక ఓ పరిచయం. ఇది రిసర్చి స్కాలర్ల జీవితాలపై తయారుచేసిన కామిక్ స్ట్రిప్. 1997 లో స్టాన్ఫోర్డ్ లో Jorge Cham అన్న విద్యార్థి చేతుల్లో జీవితాన్ని మొదలుపెట్టింది. ఆదే JOrge తర్వాత..పీహెచ్డీ పూర్తి చేసి, కొన్నాళ్ళు కాల్టెక్ (Caltech) లో మెకానికల్ ఇంజినీరింగ్ చదువు చెప్పి కాలక్రమంలో అది కూడా వదిలి పూర్తి సమయం ఈ సైటుకే కేటాయించేదాకా సాగింది ఈ కామిక్స్ పయనం. ఇంకా సాగుతూనే ఉంది. ఇందులోని పాత్రలు – క్యాంపస్ లో చదువుకుంటున్న వాళ్ళు ఎవరికైనా అనుభవంలో కనిపించేవే. అందుకే దీనికి విద్యార్థుల్లో చాలామంది అభిమానులు… అందులో నేనూ ఒకదాన్ని అని…. చెప్పుకుంటున్నా…సగర్వంగా
దీని గురించి నాకంటే వికీ బాగా పరిచయం చేస్తుంది. ఇక్కడ చదవండి.
ఈ కామిక్స్ లో ఎన్ని చోట్ల – “అరే…ఇది నా గురించే!” అనిపిస్తుందో లెక్కలేదు. ఒకసారి మొదలుపెట్టాలే కానీ… ఆపడం మీ చేతుల్లో లేదు. ఒక్కోటి తెరవడం.. మీ చుట్టుపక్కల మనుషులెంతమందున్నారు? అన్న దాన్ని బట్టి మీ నవ్వుల శబ్ద తరంగాలు బయటకి రావడమూ…. బాగా నచ్చితే, పక్క మనిషి కాలరు లాగి వాళ్ళకీ చూపడమూ… లేకుంటే… కాలరు దొరకబుచ్చుకోలేని దూరం లో ఉంటే…. మెయిల్ పంపి వాళ్ళనీ ఇటు లాగడమూ…. ఇదొక వ్యసనం… కానీ… జంధ్యాల గారు అన్నట్లు “నవ్వడం ఓ భోగం, నవ్వించడం ఓ యోగం” కనుక… మనం భోగాన్ని అనుభవిస్తూ, మన స్నేహితులకూ,స్నేహితురాళ్ళకూ కూడా ఆ భోగం కలిగించే యోగం కలిగి ఉంటాము ఈ కామిక్స్ చదివితే… కనుక, ఇది మంచి వ్యసనం కిందే లెక్క.
ఫోరర్ ఎఫెక్ట్ అంటారట – ఏదన్నా చదవగానే మనకు “అరే! ఇది నాగురించే!” అనిపించడాన్ని. ఈ కామిక్స్ లో అది పుష్కలంగా ఉంది. ఇది చదవడం మొదలుపెట్టాక నాకు ఎన్ని నిజ జీవిత సందర్భాల్లో ఇవి గుర్తు వచ్చాయో లెక్కలేదు. సిసీలియా, మైక్, ప్రొఫెసర్ జోన్స్, ప్రొఫెసర్ స్మిత్, పేరు లేని హీరో, టేజెల్…. అన్ని పాత్రల్లోనూ పూర్తి జీవకళ ఉంది.. నిజ జీవితం నుండి పుట్టినవి కనుక కాబోలు. అవి యూఎస్ యూనివర్సిటీల జీవితాన్ని ఆధారం చేసుకుని రాసినవే అయినా కూడా, చాలా మటుకు క్యాంపస్ లోనే ఉంటున్న ఎవరైనా కూడా వాటిలో తమని తాము చూసుకోగలరు. పీహెచ్డీ ప్రయాణం లో ఎదురయ్యే కష్టాలు, నష్టాలూ,సుఖాలూ, బాధలూ…. స్నేహాలూ, గైడ్ తో సంబంధాలూ – ఒకటేమిటి… అన్నింటికీ ఈ కామిక్స్ లో స్థానం ఉంది. ఆ పాత్రలు మన ఎదురుగ్గా ఉన్నట్లే ఉంటుంది… “అరే…సిసిలియా వీడిలా చేసిందే… అరే, టేజెల్ అంతా వాడిలాగే చేసింది…” – ఇలా ఎన్నిసార్లు అనిపించిందో లెక్కలేదు నాకు.
నాకు బాగా నచ్చినవి ఈ వెయ్యిలో సుమారుగా ఉన్నాయి.. మిమ్మల్ని ఈ కామిక్స్ లోకి లాగడానికి ఎరగా వీటిలో ఏవన్నా పనికొస్తాయి అని నా నమ్మకం. నా ఫేవరెట్స్ నుంచి random గా ఓ పది ఏరి ఇక్కడ ఇస్తున్నా…చూడండి.
3. పుట్టినరోజు
4. మనం మారము!
7. ఆగాగు…
9. పగటి కలలు
10. సాలిటైర్
మీకు నచ్చితే…మీరో ముగ్గురికి చెప్పండి. వాళ్ళని కూడా తలో ముగ్గురికి చెప్పమని చెప్పండి… ఈ గొలుసు ఇలా కొనసాగాలి అని చెప్పండి… లేదంటే… వాళ్ళ మెయిల్స్ ని నేను ఈకామిక్స్ లంకెలతో స్పాం చేస్తా అని కూడా చెప్పండి….
పీహెచ్డీ కామిక్స్…. జిందాబాద్..!
పీ ఎచ్ డీ గురించి ఆలోచిస్తున్న నాకు వొక దారి చూపించారు
కృ-లు.
మా దేవుడు డిల్బర్ట్ లెండి
anyway బోర్ కొడితే చూడటానికి ఇంకో కామిక్ ని పరిచయంచేసారు… థాంక్సులు
నేను గత ఆరేళ్ళుగా చదువుతున్నాను….ఈ మధ్యే నా Ph.D పూర్తయ్యింది…నాకూ చాలా సార్లు నాగురించే రాసారేమొ అనిపించేది….నేను ఇక్కడ USA లో Ph.D చేసే స్నేహితులందరికి అంటించాను….ఈ స్త్రిప్స్ ని
నా కార్టూన్ ఫీడులలో ఏడాదికి క్రితం ఎప్పుడో దీనికి స్థానం దొరికింది.
అప్పటి నుంచీ చదివి ఆనందిస్తూనే ఉన్నా…
నాకు నచ్చిన వాటిలో మాత్రం కాల్విన్, డిల్బర్ట్ మొదటి రెండు స్థానాలు.
నేను వీటిని కామిక్ నెం ౧ నుండి కామిక్ నెం ౧౦౦౦ వఱకూ అన్ని చదివాను.
చాలా చాలా బాగుంటాయి.
రాఘవ,
జాగ్రత్త మఱి
నేను ఈ కామిక్కులు చదివింతరువాత, పిచిడీ చెయ్యాలనే ఉద్ధేశాన్ని పూర్తిగా విరమించుకున్నాను
సౌమ్యా.. మనం కొంచం విశ్వనాధుని జ్ఞానపీఠం వదిలి ,ఇంకో విశ్వనాధుని కళాతపస్సు నించి బయటకు వచ్చి మరో వీరేన్ధ్రనాధుని వెన్నెల్లో ఆడపిల్ల లా అలసి పోకుండా ఒక పని చేద్దాం మనకోసం రాసిన పుస్తకాలన్నిటిని వినాయక చవితి రోజు విగ్రహం ముందు పెట్టి దండం పెడదాం. ఎందుకంటే మనం చదివే ప్రతి పుస్తకం మననుంది మనను దూరం చేసి దాని రచయితకు దగ్గర చేస్తుంది . కోల్పోవడం అంటే సరిగ్గా ఇదే. ఎంత బాగా రాస్తావు నువ్వు (క్షమించాలి నేను నీకన్నా పెద్దవాడినని
నా ఫీలింగ్ అందుకే నువ్వు అంటున్నా..) కాని సౌమ్య , ప్రతి పుస్తకం మనకి సంతోషాన్ని ఇస్తుంది నీ జీవితం నీకు ఆనందాన్ని ఇస్తుంది . ఆనందం ఎప్పుడూ సంతోషానికి తల్లివంటిది .సొ … నీ జీవితం నువ్వు చదివిన పుస్తకాలవల్ల వచ్చిన సంతోషానికి తల్లివంటిది . ఇంత సౌమ్యంగా రాసే నువ్వు ఈసారి ఏం రాయాలా అని చదవకుండా జస్ట్ ఏదో ఒకటి రాసి చదువు …. ఎంత బాగుంటుందో తెలుసా …. చిక్కని తీనే తగినట్టు ఉంటుంది ….
@Potana garu:
Thanks for the comment..but, I dont think I got what you wanted to convey.
Naaku ade anipinchindi, tarvatha veligindi..”O pustakam raasthe pola ani”…:)pustakam peru kuda “sowmya sammatam” ani pedite oo pani ipotundi kadani…
సౌమ్య గారు,
మీరు చూపించిన స్ట్రిప్స్ చూసి సైట్లోకి వెళ్లాను. నిజానికి శ్రీ ఎప్పుడొ దీని గురించి చెపితే పట్టించుకోలేదు.(పెరటి చెట్టు సామెత లాగా)కొంచెం టైం కావాలి మొత్తం చూడ్డానికి.
పుస్తకం ఎప్పుడు మొదలెడుతున్నారో చెప్పండి. నాకో కాపీ బుక్ చేసుకోండి.