“తెలువారిలో తెలుగుదనం చచ్చిపోయి ఎన్నో ఏండ్లయింది. “అది ఎప్పుడో ఉండేది” అని కూడా మన తెలుగుపిల్లలెరుగరు.” – అంటూ వేలూరి శివరామ శాస్త్రి గారు శ్రీపాద వారికి రాసిన లేఖలో అన్నారు…ఆ తరువాత అన్న ఓ వాక్యం… అది వారు అప్పటికి నలభై ఏళ్ళ క్రితం అన్నది …ఆ లేఖలో ఉటంకించారు…ఆ వాక్యం చదవగానే..నాలో ఏమిటో చెప్పలేని బాధ కలిగింది…. నేనేదో పెద్ద తెలుగు అభిమానిని అని కాదు కానీ… ఎందుకో అది నన్ను సూటిగా తాకింది..ఆ వాక్యం -
”నీ తెలుగెవ్వరిపాలు చేసి తిరిగెదవాంధ్రా!” – అని.
శ్రీపాద వారి ఆత్మకథ – “అనుభవాలూ జ్ఞాపకాలూను” పుస్తకం మొదట్లో చదివినవారన్న మాటలలో ఇది చూసాను.
ఆ కాలానికే శివరామ శాస్త్రి గారు అలా అనుకుంటే ఇక ఇప్పుడు ఏమనుకోవాలో!!!
అప్పుడు వారు మాట్లాడేది తెలుగిష్,మనము ఇప్పుడు మాట్లాడేది తెంగ్లీష్.
మీ బ్లాగు ని ఆంధ్ర జ్యోతి వారు గుర్తించి 22-11-2007 నాటి యౌంగ్ వరల్ద్ లో బ్లాగు పేరు ముద్రించారు….అభినందనలు….
TVBHASKAR
timesofbhaskar.blogspot.com
భళరే,బాధాకరమైన విషయమును క్లుప్తముగా ఘాటుగా చెప్పావు.మన భాషను మనం
కాపాడకపోతే ఇంకెవరు కాపాడెదరు.
నీకు నా అండ ఎప్పటికీ ఉంటుంది.
bye.
భలే వారే! చక్కగా మా టివి లో యువ అనే సీరియల్ లో మన యువతరంగం స్వఛ్చమైన తెలుగులో మాట్లాడుతుంటేనూ, మన రేడియో జాకీ లు తెలుగుకున్న బాకీ తీర్చేస్తుంటేనూ, మీరిలా బాధపడడం ఏలనో?