ఈ విధమైన Title పెట్టినందుకు భారత క్రికెట్ అభిమానులు నా మీద దండెత్తుతారో ఏమో! అయినప్పటికి, నిన్న కపిల్ దేవ్ అన్నట్లు – బంగ్లా జట్టు కు రెండో రౌండు కు వెళ్ళే అర్హత ఉంది. ఇప్పుడు అది వెళ్ళాలి. అక్కడ ఎలా ఆడుతుంది అన్నది పక్కన పెడితే – ఈ ప్రపంచ కప్ లో తన మొదటి మ్యాచ్ ఆడిన రోజు చూపిన spirit దానికి ఆ అర్హత ను ఇచ్చింది అని నా అభిప్రాయం. భారత జట్టు పై ఉన్న అభిమానాన్ని అటు పక్కన బెట్టి ఈ జట్టునూ, ఆ జట్టునూ తటస్థంగా చూస్తే అర్థం ఔతుంది ఈ విషయం.
అయితే, ఒకటి ఉంది – ఈ తరహా system లో ఏ జట్టుకైనా మొదట దెబ్బ తగిలిందంటే కోలుకునే అవకాశాలు తక్కువ. 1996 ప్రపంచ కప్ లో ప్రతి జట్టూ లీగ్ దశలో 5 మ్యాచ్ లు ఆడింది. 1999 కప్ లో కూడా ప్రతి జట్టూ 5 మ్యాచ్లు ఆడింది. ఆ రెంటిలోనూ 12 జట్లు ఉన్నాయి. రెండు గుంపులుగా విభజించారు. ఒక్కో గుంపు లో 6 జట్లు. ప్రతి జట్టూ తన గుంపు లో అన్నింటితోనూ ఆడుతుంది. 2003 ప్రపంచ కప్ లో 14 జట్లు ఉన్నాయి. 7 జట్లను ఒక గుంపు లో వేసారు. దీని తో ప్రతి జట్టూ ఆరు మ్యాచ్ లు ఆడింది లీగ్ దశలో. దీని వల్ల ఒకటి అరా ఓడినా కూడా కోలుకునే అవకాశం ఉండింది. ఈ ప్రపంచ కప్ లో 4 జట్లను ఒక గుంపు గా చేసి పొరపాటు చేసారేమో అనిపిస్తుంది. అలాగని 8 ఒక గుంపు గా పెట్టి ఉంటే మరీ ఎక్కువ అయ్యేవేమో మ్యాచ్లు. టీముల సంఖ్య తగ్గించడం ఒక మార్గం కావొచ్చు. లేకుంటే పెంచడం ఒక మార్గం.
భారత జట్టు నిష్క్రమణ కు కర్ణుడి చావుకి లక్ష కారణాలన్నట్లు బోలెడు కారణాలుండొచ్చు. అందులో బంగ్లా ఒకటి. ఈ schedule ఒకటి. ఆటతీరు మరోటి. ఏదేమైనా బంగ్లా జట్టు super-8 లోకి వెళ్ళడం భారత జట్టు పక్షం తీసుకోకుండా తటస్థంగా ఆలోచిస్తే మంచి సూచన. బంగ్లా క్రికెట్ పరంగా ఆలోచిస్తే మరీ మంచి సూచన. ఈ ఒక్క విషయం అక్కడి క్రికెట్ లోకం లో ఎంతో ప్రభావం చూపగలదు. భారత జట్టు 1983 లో కప్ గెలిచినప్పుడు ఇక్కడి అభిమానుల్లో ఎలాంటి ఉత్సాహం పెల్లుబికిందో – ఇంచుమించి అలాంటిదే ఉండిఉంటుంది బంగ్లా లో పరిస్థితి ఇప్పుడు. బంగ్లా కప్పు గెలవడం వరకు వెళ్ళదు అని నా ఊహ. కానీ, కచ్చితంగా, its a better team than what it was. బంగ్లా ఆటగాళ్ళకు కూడా ఈ సూపర్-8 లోకి అడుగుపెట్టడం ఎంతో స్పూర్తి ని ఇచ్చి ఉంటుంది.
మనం కూడా ఓ చిన్న జట్టు చూపిస్తున్న “పెద్ద” పటిమ ను అభినందిద్దాం. భేషజాలను పక్కనబెట్టి మనసారా బంగ్లా జట్టు ఇలాగే దిన దిన ప్రవర్థమానమవ్వాలని కోరుకుందాం. వేయి మైళ్ళ ప్రయాణమైనా ఒక్క అడుగుతో మొదలుపెడతాం. ఈ బంగ్లా తొలి అడుగులను పదేళ్ళ తరువాత అది ఏ ప్రపంచ కప్పో గెలుస్తూ ఉంటే తలుచుకుంటామేమో. ఎవరికి తెలుసు? ఏమంటారు? Good luck Bangladesh!!
నిజమేనండి. Good luck to Bangladesh!”
–ప్రసాద్
http://blog.charasala.com